
చికెన్.. అనగానే నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. చికెన్ ఫ్రై, కర్రీ, పచ్చడి.. ఇంకా చాలా రకాల రెసిపీలను వండుకుని ఇష్టంగా ఆరగిస్తారు. కొంత మంది అయితే.. రోజూ చికెన్ తినకుండా ఉండలేరు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే.. చికెన్ ను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు డైటీషియన్లు.. చికెన్ భారతీయ వంటకాల్లో ఒక ప్రముఖ భాగం.. ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఇష్టంగా కొని తెచ్చుకుంటారు.

చాలా మందికి చికెన్ అంటే ఇష్టమే. అయితే, కొన్ని చికెన్ భాగాలను తరచుగా తినడం ఆరోగ్యానికి హానికరం అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. మాంసాహారంలో సాధారణంగా ఆర్గాన్ మీట్లను ప్రోత్సహించరు. కిడ్నీలు, లివర్, మెదడు, మరియు ప్రేగులు వంటివి జంతువుల శరీరంలోని జీర్ణవ్యవస్థలో భాగం కావడంతో అవి అంత ఆరోగ్యకరమైనవి కావు.

ఈ ఆర్గాన్ మీట్లు, నెక్ పీసులు, చికెన్ కాళ్లు (వేళ్లు), గుడ్లు (లోపలి భాగాలు), లేదా మటన్ బోటీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌట్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల, వీటిని నిరంతరం తినడం మానుకోవాలి.

బదులుగా, చికెన్ బ్రెస్ట్, లెగ్ పీస్ లేదా థై పీసులు కొంచెం వరకు మంచి ఎంపికలు.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అంతేకాకుండా ఆరోగ్యకరమైనవని నిపుణులు చెబుతున్నారు. వీటిని కర్రీగా ఫ్రైగా చేసుకుని తినొచ్చు..

అప్పుడప్పుడు ఆర్గాన్ మీట్లను తినడం పర్వాలేదు.. కానీ, వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. ఈ సూచనలను పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..