
ఈ అటుకుల పాయసాన్ని పల్లెటూరిలో ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి ఇలా చేసి తింటే జన్మలో మర్చిపోలేని రుచి ఉంటుంది. అంతేకాదు, దీనిని మీ పిల్లలకు పెడితే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని బెల్లంతో, పంచదారతో చేస్తారు. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

అటుకుల పాయసానికి కావాల్సిన పదార్ధాలు : మూడు కప్పులు అటుకులు, నాలుగు కప్పుల పాలు , 150 గ్రాముల బెల్లం, ఒక కప్పు కొబ్బరి తురుము , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె , జీడిపప్పులు , కిస్ మిస్ లు , పిస్తా పప్పులు తీసుకోవాలి ఇవి ఈ స్వీట్ రుచిని పెంచుతాయి.

ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి దానిలో అటుకులను రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అటుకులను నూనెలో వేయించితే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. అలాగే, బెల్లం తురుము తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి.

మళ్ళీ ఇంకో పాన్ తీసుకుని దానిలో బెల్లం వేసి మూడు కప్పుల పాలు పోసి బెల్లం తురుమ, యాలకుల పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పాలు బాగా కాగిన తర్వాత ముందుగా వేయించుకున్న అటుకులను వేసి 10 నిమిషాల పాటు మెత్తగా ఉడికించాలి. ఇలా చేస్తే పళ్ళులేని ముసలివాళ్ళు కూడా తినొచ్చు.

అటుకులు వేసి ఇలా కలుపుకోవాలి: చివర్లో ఈ మిశ్రమంలో అటుకులు వేసి ఇలా కలుపుకోవాలి.ఆ తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పులు, జీడీ పప్పులు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి విలేజ్ అటుకుల పాయసం రెడీ.