
జలపాతాలు : అరకులోయలో అద్భుతమైన జలపాతాలు ఉంటాయి. ముఖ్యంగా కటికి జలపాతం, చాపరాయి జలపాతం, డుంబ్రిగూడ జలపాతం. ఇవన్నీ కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అందువలన తప్పకుండా అరకు వెళ్లేవారు ఈ జలపాతాలను మిస్ కాకుండా చూడాలి. ఫొటో గ్రఫీకి కూడా ఇవి చాలా బెస్ట్.

చారిత్రక గుహలు, ప్రకృతి వనాలు : అరకు వెళ్లిన వారు తప్పకుండా బొర్రా గుహలు చూడాల్సిందే. చాలా అద్భుతంగా ఉంటుంది. బొర్రా గుహలు, పద్మాపురం బొటానికల్ గార్డెన్స్, అనంతగిరి కొండలు ఇవన్నీ కూడా చాలా అద్బుతంగా ఉంటాయి. అందువలన తప్పకుండా ఈ ప్రదేశాలు చూడాల్సిందే.

కాఫీ తోటలు : కాఫీ తోటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందమైన కాఫీ తోటల మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును. అందువలన అరకు వెళ్లిన వారు తప్పకుండా కాఫీ తోటలను చూసి అక్కడ ఆనందంగా గడపవచ్చును.

ట్రైబల్ మ్యూజియం, గిరిజన నృత్యాలు : అరకులో ట్రైబల్ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా గిరిజనుల జీవన విధానం, కళలను ప్రదర్శించే, ఈ మ్యూజియం అరకు మధ్యలో చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళితే గిరిజనుల జీవన విధానం గురించి తెలుసుకోవచ్చును. అంతే కాకుండా గిరిజన నృత్య ప్రదర్శనలు కూడా చాలా ఆకట్టుకుంటాయి.

అయితే చాలా మంది అరకు వెళ్లడానికి బెస్ట్ సమయం ఏంటి అనుకుంటారు. కానీ ఈ ప్లేస్‌ను సందర్శించడానికి ఎప్పుడైనా వెళ్లొచ్చు. ముఖ్యంగా వేసవిలో మార్చి జూన్ మధ్య అదే విధంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వెళ్లడానికి చాలా అనువైనది. ఆనందంగా పచ్చటి ప్రకృతిలో ఎంజాయ్ చేయవచ్చును.