మంచు కురిసే వేళలో.. అరకులో అందాల జాతర

Updated on: Nov 21, 2026 | 9:02 AM

అరకు అందాలు అందరినీ కనువిందు చేస్తున్నాయి. మంచు కురుస్తూ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తెల్లని మంచు ఎత్తైన కొండల అందాలను చూసి పర్యాటకులు పరవశించి పోతున్నారు. అయితే మీరు కూడా అరకు అందాలు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఫొటోస్ చూసేయ్యండి.

1 / 5
అరకు గురించి చెప్పాల్సిన పని లేదు. దీనిని ఆంధ్రా ఊటీ అని కూడా అంటారు. నిత్యం వేలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కొంత మంది సమ్మర్‌లో వెళ్లితే మరికొంత మంది శీతాకాలంలో వెళ్తారు. అయితే ప్రస్తుతం అరకు తన అందాలతో అబ్బరపరుస్తుంది. ముఖ్యంగా మంచు దుప్పటి కప్పుకొని చాలా అందంగా ఉంది.

2 / 5
పాడేరు ఏజెన్సిలో క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. దీంతో అరకులో దట్టంగా పొగమంచు కురుస్తుంది. పొగ మంచు మధ్య ప్రకృతి సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.  దీంతో ఏజెన్సికి సందర్శకుల తాకిడి పెరిగింది. మరీ ముఖ్యంగా వీకెండ్ కావడంతో  పర్యాటక ప్రాంతాలకు రద్దీ విపరీతంగా పెరిగింది.

3 / 5
చాలా ఫ్యామిలీస్ తమ పిల్లలను తీసుకొని వస్తే, స్నేహితులు కూడా గ్రూప్‌గా వచ్చి అరకు అందాలను వీక్షిస్తున్నారు. పర్యాటకుల రాకతో అరకులో  సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా హోటళ్ళు, లాడ్జిలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఎత్తైన కొండలు, పచ్చటి ప్రకృతిలో ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు.

4 / 5
ముఖ్యంగా అరకులోని మాడగడ మేఘాల కొండకు పర్యాటకులు  క్యూ కట్టారు. దుప్పటిలా పరుచుకున్న మంచును చూసి మురసి పోతున్నారు. కొండల మధ్య అప్పుడే ఉదయిస్తున్నట్లుగా కనిపించే సూర్యుడు, మంచు దుప్పటి ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. ఇక పర్యాటకులు కూడా మేఘాల కొండను, సన్ రైజ్ ను ఆస్వాదిస్తూ సందడి చేస్తున్నారు.

5 / 5
ముఖ్యంగా దింసాతో గిరిజనులు పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నారు. దింసా నృత్యం చేస్తూ కూడా పర్యాటకులు ఆనందంలో మునిగిపోతున్నారు. ప్రస్తుతం అరకులో సందడి వాతావరణం నెలకొంది. అందుకే అరకు వెళ్లాలి అనుకునే వారు ఈ సమయంలో వెళ్లడం చాలా మంచిది. మంచు కొండను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చును.

Loading...
Unable to load recommendations.
Follow Us