ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో-మ్యాక్స్ మోడళ్లు నాలుగు వేరియంట్లలో యూజర్లకు లభించనున్నాయి. అలాగే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో.. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో-మ్యాక్స్ టైటానియం వైట్, నేచురల్ టైటానియం, టైటానియం బ్లూ, టైటానియం బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంటాయి. ఈ మోడళ్లకు iOS 17 అప్‌డేట్‌తో పాటు USB-C సపోర్ట్ కూడా ఉంది.