అపోలో ఫిష్ పకోడీ.. రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి

Updated on: Apr 16, 2026 | 1:27 PM

Apollo Fish Pakoda Recipe : అపోలో ఫిష్ పకోడీ రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి. ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించే రుచి. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5
ముందుగా అపోలో ఫిష్ తీసుకుని, వాటికి ఉప్పుతో వేసి ఒకటికి మూడు సార్లు బాగా శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయి.

2 / 5

ఈ ముక్కలకు మసాలాలు పట్టించుకోవాలి: ఆ తర్వాత ఈ  ముక్కలను తీసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
మ్యారీనేట్ చేసిన అపోలో ఫిష్  ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా కారం, మసాలా పొడి , అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసి  మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

4 / 5
ఇప్పుడు  ఒక గిన్నె తీసుకుని దానిలో  అపోలో ఫిష్ చేప ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి,  నాలుగు కరివేపాకు ఆకులు , కొద్దిగా నీళ్ళు పోసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

5 / 5
ఇక చివర్లో గ్యాస్ స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, శనగ పిండి పట్టించిన చేప ముక్కలను తీసుకుని గోల్డ్ కలర్లోకి మారే వరకు వాటిని బాగా వేయించుకోవాలి.

Follow Us