ఆవకాయ చికెన్ పులుసు ఇలా చేస్తే ఎవ్వరికైనా నచ్చాల్సిందే

Updated on: Mar 19, 2026 | 2:13 PM

చికెన్‎తో ఏ కూర చేసిన కూడా రుచి అదిరిపోతోంది. అయితే, వాటిలో ఆవకాయ చికెన్ పులుసు ఇలా చేసి తింటే ఎవ్వరికైనా నచ్చాల్సిందే. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి తినండి. మరి, ఇంకెందుకు లేట్ ఇక్కడ చదివి తెలుకోండి

1 / 5
కావాల్సిన పదార్దాలు: అర కిలో చికెన్, ఆవకాయ నూనె,  మామిడికాయ ముక్కలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, ఉల్లిపాయలు 
రెండు పెద్ద టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, 
అర టీ స్పూన్ పసుపు ,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, 
కరివేపాకు ఆకులు, నూనె రెండు టేబుల్ స్పూన్లు , కొత్తిమీర ఆకులు తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు: అర కిలో చికెన్, ఆవకాయ నూనె, మామిడికాయ ముక్కలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు ఆకులు, నూనె రెండు టేబుల్ స్పూన్లు , కొత్తిమీర ఆకులు తీసుకోవాలి.

2 / 5
ముందుగా చికెన్ ముక్కలను తీసుకుని ఉప్పుతో బాగా  క్లీన్ చేసుకుని బాగా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత వాటికి కొద్దిగా నిమ్మరసం,  పెరుగును పట్టించి  పక్కన పెట్టుకోవాలి.

ముందుగా చికెన్ ముక్కలను తీసుకుని ఉప్పుతో బాగా క్లీన్ చేసుకుని బాగా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత వాటికి కొద్దిగా నిమ్మరసం, పెరుగును పట్టించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఊరగాయ ఆయిల్ వేసి దానిలో అర టీ స్పూన్ జీలకర్ర, పది ఎండుమిర్చి, పది కరివేపాకు ఆకులు , ఉల్లిపాయలు ,టమాటాలు వేసి అవి మగ్గే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా వేయించాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఊరగాయ ఆయిల్ వేసి దానిలో అర టీ స్పూన్ జీలకర్ర, పది ఎండుమిర్చి, పది కరివేపాకు ఆకులు , ఉల్లిపాయలు ,టమాటాలు వేసి అవి మగ్గే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా వేయించాలి.

4 / 5
ఇక ఇప్పుడు టమాటా ముక్కలు తీసుకుని వాటిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, సాల్ట్ కూడా వేసి వాటిని బాగా వేయించాలి. ఆ తర్వాత చింతపండు రసం, ఒక గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ మీదే ఉంచి ఉడికించుకోవాలి.

5 / 5
ఉడుకుతున్న పులుసులో ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను,  మామిడి ముక్కలను ఈ మిశ్రమంలో వేసి మూత పెట్టి సన్నని మంటపై వాటిని బాగా  ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో తినడమే.

ఉడుకుతున్న పులుసులో ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను, మామిడి ముక్కలను ఈ మిశ్రమంలో వేసి మూత పెట్టి సన్నని మంటపై వాటిని బాగా ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో తినడమే.

Follow Us