ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో ఈజీగా చేసే రెసిపీ

Updated on: Nov 19, 2026 | 11:04 PM

ఏడాది పాటు నిల్వ ఉండే రుచికరమైన నాటు ఉసిరికాయ నిల్వ పచ్చడిని మీరు పక్కా కొలతలతో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. ఈ సంప్రదాయ ఆమ్లా పచ్చడి రెసిపీలో నాటు ఉసిరికాయలు, ఆవపిండి, మెంతిపిండి తయారీ, చింతపండు గుజ్జుతో తీసుకుంటారు

1 / 5
ఏడాది పాటు నిల్వ ఉండే రుచికరమైన ఉసిరికాయ నిల్వ పచ్చడిని మీరు పక్కా కొలతలతో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. ఈ సంప్రదాయ ఆమ్లా పచ్చడి రెసిపీలో నాటు ఉసిరికాయలు, ఆవపిండి, మెంతిపిండి తయారీ, చింతపండు గుజ్జుతో తీసుకుంటారు

2 / 5
ఉసిరికాయల ఎంపిక, శుభ్రపరచడం:  మంచి నాటు ఉసిరికాయలను తీసుకోవడం ఉత్తమం. అయితే, మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజువి పచ్చడికి  బాగుంటాయి. ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, ఎలాంటి తడి లేకుండా పొడి క్లాత్ తో  తుడిచి ఆరబెట్టుకోవాలి. తడి అస్సలు ఉండకూడదు. చింత గింజలు తీసేసిన చింతపండును ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో  కప్పు బాగా మరుగుతున్న నీటిని పోసి నానబెట్టాలి. చింతపండు మెత్తబడిన తర్వాత నీటితో సహా మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.స్టవ్ మీద మందపాటి పాన్ పెట్టి, అందులో 1 టేబుల్‌స్పూన్ ఆవాలు వేసి తక్కువ మంటపై వేయించాలి. అవి కొద్దిగా చిటపటలాడుతున్నప్పుడు అర టేబుల్‌స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించి మాడిపోకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
 పాన్ లో పావు  లీటరు నూనె వేసి వేడి చేయాలి. శుభ్రం చేసుకున్న ఉసిరికాయలను రెండు లేదా మూడు బ్యాచ్‌లుగా వేసుకుని, లో-మీడియం మంటపై దోరగా వేయించాలి. ఇంకా ఈ ఉసిరికాయలు బాగా  మెత్తబడి, గరిటెతో ఒకసారి చెక్ చేసుకోవాలి మెత్తగా అయిందా లేదా అని ఆ తర్వాత  ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఉసిరికాయలు వేయించిన అదే నూనెలోకి  ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, పసుపు, వేసి పోపు వేయాలి. పోపు వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్,  టేబుల్‌స్పూన్ల కరివేపాకు వేయాలి

4 / 5
 తక్కువ మంటపై నిదానంగా కలుపుతూ, చింతపండులోని తడి అంతా పోయి, నూనె పైకి తేలే వరకు సుమారు 10 నిమిషాలు వేయించాలి. చివరిగా స్టవ్ ఆపే ముందు 2 టేబుల్‌స్పూన్ల తొక్కు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేయాలి. ఈ చింతపండు గుజ్జు గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన ఉంచాలి.

5 / 5
 వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, అందులో ఆవపిండి, మెంతిపిండి, కల్లుప్పు , పచ్చి కారం వేసి ఉసిరికాయలకు బాగా పట్టేలా కలపాలి. తరువాత గోరువెచ్చని చింతపండు గుజ్జును కూడా వేసి పచ్చడి మొత్తాన్ని బాగా కలపాలి.
 పచ్చడిని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మూడు రోజుల పాటు ఊరనివ్వాలి.

వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, అందులో ఆవపిండి, మెంతిపిండి, కల్లుప్పు , పచ్చి కారం వేసి ఉసిరికాయలకు బాగా పట్టేలా కలపాలి. తరువాత గోరువెచ్చని చింతపండు గుజ్జును కూడా వేసి పచ్చడి మొత్తాన్ని బాగా కలపాలి. పచ్చడిని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మూడు రోజుల పాటు ఊరనివ్వాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us