
చలి కాలం రాగానే చాలా మంది అమ్మాయిలకు చర్మం పొడిబారడం, కాళ్ళ పగుళ్లు రావడం వంటివి జరుగుతుంటాయి. అయితే, వీటిలో 'కాళ్ల పగుళ్లు' సమస్య ఎంతో మందిని వేదనకు గురి చేస్తుంది.

నడిచేటప్పుడు కూడా కొంచం ఇబ్బందిగా ఉంటుంది. అయితే, దీని నుంచి బయటపడటానికి ఎన్నో క్రీములు వాడుతారు. అయినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. దాని కంటే మీ ఇంట్లో ఉండే వాటితోనే ఈ సమస్యకు గుడ్ బై చెప్పొచ్చు.

తయారీ విధానం: పల్లీల పొట్టును ఒక గిన్నెలోకి తీసుకుని గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె, తేనె వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా పాలు పోసి పేస్ట్ లా చేయాలి.

మీ పాదాలను ముందుగా నీటితో శుభ్రపరచి.. ఆ తర్వాత ఈ పేస్ట్‌ను పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాసి 10 నిముషాల పాటు ఉంచి నీటితో శుభ్ర పరచుకోండి. ఇలా చేసిన తర్వాత రక్తప్రసరణ కూడా మెరుగుపడి పగుళ్లు తగ్గుతాయి.

అమ్మాయిల్లో ఎవరైతే ఈ కాళ్ళ పగుళ్ళ వల్ల బాధ పడతారో వాళ్ళు వారంలో రెండు సార్లు ఇలా చేస్తే, మీ పాదాలు మెత్తగా అవుతాయి. ఖరీదైన క్రీములు వాడే కంటే, ఇంట్లో ఉండే వాటితోనే సులభంగా వాడుకోండి.