Blueberries: ఇది పండు కాదు.. పోషకాలకు పవర్ హౌస్..! రోజూ గుప్పెడు తింటే వారంలో మ్యాజిక్‌ చూస్తారు..

Updated on: Jun 06, 2025 | 12:29 PM

బ్లూ బెర్రీలు.. బెర్రీ జాతికి చెందిన ఈ పండ్లు చూసేందుకు ద్రాక్షలా చిన్నగా ఉండి.. తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. పుష్కలమైన పోషకాలు నిండి ఉన్నందున వీటిని పోషకాలకు పవర్ హౌస్ అని కూడా చెబుతుంటారు. వీటిని ఎక్కువగా స్మూథీల్లో వేసుకొని తీసుకుంటారు. క్రమం తప్పకుండా వారం రోజుల పాటు ఈ బ్లూ బర్రీలు తినటం వల్ల మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. బ్లూ బెర్రీస్‌ తీసుకోవటం వల్ల లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
బ్లూబెర్రీస్ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. దీంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కడుపు చుట్టూ ఉన్న కొవ్వును, బెల్లీ ఫ్యాట్‌ కరిగించడానికి చక్కటి ఔషధంగా బ్లూబెర్రీస్ దోహదం చేస్తాయి. బ్లూబెర్రీస్ మూత్ర విసర్జనలో సమస్యలను తగ్గిస్తాయి. మూత్రపిండాల నుంచి విషాన్ని బయటకు పంపేందుకు దోహదం చేస్తుంది.

2 / 5

డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు బ్లూబెర్రీస్‌ హ్యాపీగా తినొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది వారిలో ఇన్సూలిన్‌ నిరోధకతను మెరుగు చేస్తుంది. బ్లూబెర్రీస్‌లో ఉండే అధిక ఆల్కలాయిడ్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది టైప్‌ 2 డయాబెటీస్‌తో బాధపడేవారు తప్పక తీసుకోవాలని అంటున్నారు.

3 / 5
ఈ పండ్లలో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. కీళ్లనొప్పులు, ఆస్తమా, కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలకు కూడా బ్లూబెర్రీ చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. బ్లూబెర్రీస్ కండరాలను బలోపేతం చేయడానికి.. మెదడు కార్యకలాపాలను ప్రేరేపిస్తాయి. మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

4 / 5
అంతేకాదు.. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు బ్లూబెర్రీస్‌ తినటంవల్ల మంచి ఫలితం ఉంటుంది. పైగా, ఇది శరీరానికి మంచి హైడ్రేషన్‌ అందిస్తుంది. బ్లూబెర్రీస్‌లోని విటమిన్ సీ, ఈ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి మెరిసే.. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి.

5 / 5
బ్లూ బెర్రీస్‌ మధుమేహాన్ని నివారించడమే కాకుండా చర్మాన్ని అందంగా ఉంచుతుంది. ఇందులో ఆంథోనిసైనిన్స్‌ అనే పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఫ్రీ ర్యాడికల్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. అలాగే, కంటి చూపును కూడా మెరుగు చేస్తాయి.