
వంటగదిలో ఎక్కువగా నూనె పోసి ఆహారం ఉడికించడం కంటే, చాలా మంది ఎయిర్ ఫ్రైయర్ ద్వారా తక్కు నూనె లేదా అస్సలే నూనె వాడకుండా ఆహారాలను డీప్ ఫ్రై చేససుకుంటన్నారు. మరి అసలు ఎయిర్ ఫ్రైయర్ నూనె లేకుండా ఆహారాన్ని ఎలా వేయిస్తుంది అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కానీ నిజానికి అది ఆహారాన్ని వేయించదు, ఫుడ్ చుట్టూ వేడి గాలి ప్రసరింప జేసి, బాస్కెట్‌లో ఉండే ఆహారం రంధ్రాల ద్వారా కదులుూ, పై బంగా బంగారు రంగులోకి మారి ఆహారం ఫ్రై అవుతుందంట.

అంతే కాకుండా డీప్ ఫ్రైయింగ్ చేసినప్పుడు తక్కువ నూనె వాడటం వలన ఇది అదనపు కొవ్వు నుంచి వచ్చే కేలరీలను తగ్గిస్తుంది. అంతే కాకుండా పొటాటో వెడ్జెస్ వంటివి, ఫ్రోజెన్ ఫ్రైస్, నగ్గెట్స్ వంటి ప్యాక్ చేసిన వాటిలో ఎక్కువ కొవ్వులు ఉంటాయి. కానీ వీటిని ఎయిర్ ఫ్రైయర్‌లో చేసి తినడం వలన అదనపు నూనె అవసరం పడదు. కేలరీలు తక్కువగా ఉంటాయి. తద్వారా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఎంపిక అవుతుంది.

అయితే మీరు ఎప్పుడూ ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించినా, దాని నాన్ సిస్టిక్ కోటింగ్‌లను పరిశీలించాలని చెబుతున్నారు నిపుణులు. వాటిలో PTFE ఒక సాధారణ ఎంపిక. ఇతర మోడల్‌లు సిరామిక్ కోటింగ్‌లను లేదా స్టెయిన్‌లెస్-స్టీల్ వంట ఉపరితలాలను ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, ఫిలిప్స్ తన చాలా ఎయిర్-ఫ్రైయర్ పాన్‌లు, బాస్కెట్‌లు, మెష్‌లు PTFE కోటింగ్‌ను ఉపయోగిస్తాయని, అయితే దాని 7000 సిరీస్‌లోని కొన్ని మెష్‌లు సిరామిక్ కోటింగ్‌ను ఉపయోగిస్తాయని చెబుతోంది. ఇది మరీ ఆరోగ్యానికి అసరుక్షితమైనది కాదు, కానీ తీవ్రంగా వేడెక్కుతుందంట. అయితే వీటిని తీసునే సమయంలో సెరామిక్ కోటింగ్ ఉన్న ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవడం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.

ఇక ఆహారాన్ని బంగారు రంగులోకి, కరకరలాడేలా కాల్చే క్రమంలో ఎయిర్ ఫ్రయర్లకు ఎక్కువ ఉష్ణోగ్రతలు అవసరం అవుతాయి. ఈ క్రమంలోనే అక్రిలమైడ్ ప్రస్తావన వసస్తుంది. కొన్ని రకాల చక్కెరలు, ఆస్పరాజైన్ అనే అమైనో ఆమ్లం కలిగిన ఆహార పదార్థాలను అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు అక్రిలమైడ్ ఏర్పడగలదని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది. ఈ విషయం వర్తించే ఆహార పదార్థాలలో బంగాళదుంపలు ఒకటి.

కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎయిర్ ఫ్రైయింగ్ వల్ల తప్పనిసరిగా అక్రిలమైడ్ ఎక్కువగా ఉండదు. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్‌లో ప్రచురించబడిన 2015 నాటి ఒక అధ్యయనంలో, సాంప్రదాయ పద్ధతిలో డీప్-ఫ్రై చేసిన బంగాళాదుంపలతో పోలిస్తే ఎయిర్-ఫ్రై చేసిన బంగాళాదుంపలలో సుమారు 90% తక్కువ అక్రిలమైడ్ ఉన్నట్లు కనుగొన్నారు.ఇక ఈ ఎయిర్ ఫ్రైర్స్ ఆరోగ్యానికి మంచివేనా అంటే అవును అనే చెబుతున్నారు నిపుణులు. దీని వలన తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు శరీరానికి అందుతాయి. అయితే ఎయిర్ ఫ్రైయర్‌లో వండిన ప్రతీ వంటకం ఆరోగ్యకరమైనది అని చెప్పలేం అని చెబుతున్నారు నిపుణులు.