
ఆలు జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మైదా పిండి 100 గ్రాములు, ఉడికించిన బంగాళదుంపలు మూడు లేదా నాలుగు, పెరుగు అర కప్పు, ఈనో, వంట నూనె, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పంచదార ఒక కప్పు.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా పాకం తయారు చేసుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని, అందులో చక్కెర, నీరు పోసి మంచిగా మరిగించాలి. కాస్త తీగ పాకంలా తాయు చేసుకోవాలి. పాకం ప్రిపేర్ అవుతుంది అనుకునే సమయంలో అందులో యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు జిలేబీలు తయారు చేయడం కోసం పిండి ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ముందుగా ఆలు తీసుకొని శుభ్రం చేసి, చాలా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత దీనిని మెత్తగా పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అందులో మైదా, పెరుగు, సోడా అన్నీ వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. దానిపై లోతైన కాస్త వెడల్పాటి పాన్ పెట్టి, జిలేబీలు వేయించుకోవడానికి సరిపడ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి అయ్యేలా చూసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. ఈ పిండిని ఒక కాటన్ క్లాత్‌లోకి లేదా, జిలేబీలు చేసే పాత్రలాంటి దానిలోకి తీసుకొని, వాటిని వేడి నూనెలో జిలేబీల ఆకారంలో ఒత్తుకోవాలి.

ఇప్పుడు వాటిని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. తర్వాత వేడి వేడి జిలేబీలను తీస్తూ మనం తయారు చేసుకున్న పాకంలో వేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఆలు జిలేబీలు రెడీ. మరి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి.