
నీటి వనరులు: మీ తోటలో చిన్న చిన్న కుంటలు, చెరువులు లేదా నీటి వనరులు ఉంటే అవి కప్పలను, రకరకాల కీటకాలను ఆకర్షిస్తాయి. ఇవి పాములకు ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా తామర, కలువ వంటి మొక్కలు ఉండే చోట పాములు నివసించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయి. వాటి మృదువైన కాండాలు పాములకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తాయి.

దట్టంగా పెరిగే గడ్డి మొక్కలు: నేలపై దట్టంగా పాకే ఇంగ్లీష్ ఐవీ లేదా పెరివింకిల్ వంటి మొక్కలు పాములకు అద్భుతమైన దాగుడు స్థలాలు. ఇవి చల్లని, తేమతో కూడిన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇలాంటి పొదల్లో పాములను గుర్తించడం దాదాపు అసాధ్యం. కాబట్టి ఇంటి చుట్టుపక్కల ఇటువంటి మొక్కలు ఉంటే వెంటనే తొలగించండి

పొదలు - పొడవైన గడ్డి: ఇంటి చుట్టూ పెరిగే దట్టమైన పొదలు, ముళ్ల కంపలు చిన్న పక్షులకు, ఎలుకలకు ఆశ్రయాన్ని ఇస్తాయి. ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా ఉంటాయో, అక్కడ పాములు తప్పనిసరిగా వస్తాయి. అందుకే మీ ఇంటి చుట్టూ గడ్డిని ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం శ్రేయస్కరం.

ఆకుల కుప్పలు, సేంద్రియ వ్యర్థాలు: తోటల్లో రాలిన ఆకులను ఒకేచోట కుప్పగా వేయడం వల్ల అవి కుళ్లిపోయి వేడిని, తేమను ఉత్పత్తి చేస్తాయి. ఈ వేడి పాములను త్వరగా ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఇలాంటి కుప్పలు ఎలుకలకు, కీటకలకు నిలయాలుగా మారి, చివరికి పాములకు విందు భోజనాన్ని సిద్ధం చేస్తాయి.

ఘాటైన వాసన గల మొక్కలు: కొన్ని రకాల తీపి, ఘాటైన వాసనలు వచ్చే మల్లె, చామంతి, అరలి వంటి మొక్కలు పాములను ఆకర్షిస్తాయని ఒక నమ్మకం ఉంది. వాసనల పట్ల సున్నితంగా ఉండే పాములు, ఆ సువాసనల కారణంగా మీ ఇంటి పరిసరాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తతతో ఉంటే ప్రమాదాలను నివారించవచ్చు.