
మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది పుచ్చకాయను తింటాం.ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే పుచ్చకాయను కొన్ని రకాల ఆహారాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందని, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాలు లేదా పెరుగు: కొంత మంది పుచ్చకాయను పాలు వేసి జ్యూస్ చేసి తాగుతూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదట. పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగడం లేదా పెరుగు తీసుకోవడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలోని నీటి శాతం జీర్ణ రసాలను పలుచన చేస్తుంది. పాలను జీర్ణం చేసుకోవడానికి ప్రత్యేక ఎంజైమ్‌లు అవసరం. ఈ రెండింటి కలయిక వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా వాంతులు అయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

అధిక ప్రోటీన్ ఆహారాలు: పుచ్చకాయన తిన్న వెంటనే లేదా తినేప్పుడు అధిక ప్రోటిన్ కలిన ఆహారాలు కూడా తినొద్దని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ చాలా త్వరగా జీర్ణమవుతుంది. కానీ మాంసం, గుడ్లు వంటి ప్రోటీన్ ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి రెండూ ఒకేసారి కడుపులోకి చేరితే, పుచ్చకాయలోని ఫ్రక్టోజ్ పులిసిపోయి , జీర్ణ వ్యవస్థపై భారం పడుతుందని చెబుతున్నారు.

నూనెలో వేయించిన పదార్థాలు: నూనెలో వేయించిన తిండి పదార్థాలు తిన్నప్పుడు పుచ్చకాయ ముక్కలను తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలోని నీరు, నూనెలోని కొవ్వును విచ్ఛిన్నం చేసే ప్రక్రియకు అడ్డుపడుతుంది. దీనివల్ల అజీర్ణం, కడుపులో బరువుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే క్షార గుణం కలిగిన పుచ్చకాయతో పాటు నిమ్మ, నారింజ వంటి పండ్లు ఆమ్ల గుణాన్ని కలిగి పండ్లను తినొద్దని చెబుతున్నారు. విరుద్ధ స్వభావం ఉన్న ఈ పండ్లను కలిపి తింటే కడుపులోని pH స్థాయి మారిపోయి అసిడిటీకి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

కాబట్టి పుచ్చకాయ తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు నీరు తాగకూడదని చెబుతున్నారు. అలాగే రాత్రి పడుకునే ముందు పుచ్చకాయ తినడం మానుకోవాలని. ఎందుకంటే ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది, దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుందని చెబుతున్నారు. కాబట్టి సమ్మర్‌లో ఎక్కువగా పుచ్చకాయ తినే ముందు ఈ జాగ్రత్తలు పాటించడం ఉత్తమం