Longevity Secrets: మీ నిజమైన వయసెంతో చెప్పే 4 కండరాలు ఇవే.. మీ బాడీ ఫిట్‌నెస్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోండి!

Updated on: Jun 06, 2026 | 8:28 PM

వయసు పెరిగేకొద్దీ, ప్రజలు తరచుగా బరువు తగ్గడం లేదా కండరాలను పెంచుకోవడంపై మాత్రమే దృష్టి పెడతారు, కానీ నిజమైన ఫిట్‌నెస్, దీర్ఘాయువు అనేవి బయటకు కనిపించని 4 ముఖ్యమైన కండరాల బలంపై ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలియదు. అమెరికాకు చెందిన హెల్త్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ జెస్సికా స్వాన్సన్ ప్రకారం.. 60 ఏళ్ల తర్వాత కూడా మీ బాడీ యాక్టీవ్‌గా ఉండాలంటే శరీరంలోని నాలుగు కీలక కండరాలు బలంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకూ ఆ కండరాలు ఏవి.. అవి చేసే పనేంటో చూద్దాం.

1 / 5
చేతి పట్టు: చేతి పట్టు అనేది కేవలం చేతులకు సంబంధించింది కాదు, ఇది మీ మొత్తం శరీర ఆరోగ్యానికి ఒక బయోమార్కర్. ఒక సాధారణ హ్యాండ్‌షేక్ ద్వారా మీ నరాలు, గుండె, మెదడు పనితీరును అంచనా వేయవచ్చు. 'ది లాన్సెట్' మెడికల్ జర్నల్ ప్రకారం, బ్లడ్ ప్రెషర్ కంటే కూడా గ్రిప్ స్ట్రెంత్ తక్కువగా ఉండటమే మరణాల ముప్పును ఎక్కువగా సూచిస్తుంది. దీనిని పరీక్షించడానికి, మీరు ఒక బార్ లేదా రాడ్‌పై వేలాడుతూ పరీక్ష చేయవచ్చు. మీ వయస్సు 50 సంవత్సరాల లోపు అయితే, పురుషులు కనీసం 30 సెకన్ల పాటు, మహిళలు 20 సెకన్ల పాటు వేలాడటానికి ప్రయత్నించాలి.

2 / 5
గ్లూట్స్ కండరాలు: ఈ కండరాలు మీరు నడుస్తున్నప్పుడు, నిలబడుతున్నప్పుడు శరీరం బ్యాలెన్స్ తప్పకుండా చూసుకుంటాయి. వయసు పెరిగే కొద్దీ ఇవి బలహీనపడితే, అడుగులు తడబడి కిందపడే ప్రమాదం పెరుగుతుంది. 65 ఏళ్లు పైబడిన వారు ఒక్కసారి కిందపడినా అది కోలుకోలేని ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. దీన్ని మీరు ఇంట్లోనే టెస్ట్ చేసుకునేందుకు కళ్ళు మూసుకుని ఒక కాలిపై నిలబడండి. మీ వయస్సు 50 ఏళ్లలోపు ఉంటే మీరు.. శరీరం అటుఇటు ఊపకుండా కనీసం 10 సెకన్ల పాటు ఒకే కాలిపై నిలబడాలి. అలా నిలబడితే మీ కండరాలు బలంగా ఉన్నాయని అర్థం.

3 / 5
పిక్కల కండరాలు: మీ పిక్కల పరిమాణం, బలం.. మీ శరీరంలో ఎంత కండరాల నిల్వ ఉందో చెప్తుంది. ఏదైనా అనారోగ్యం లేదా గాయం అయినప్పుడు మీ శరీరం ఎంత వేగంగా కోలుకుంటుందో చెప్పడానికి సాధారణ బ్లడ్ టెస్టుల కంటే కూడా ఈ కండరాల బలమే సరైన కొలమానం అని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని పరీక్షించడానికి, ఒక కాలి బొటనవేలుపై నిలబడి పిక్కలను పైకి లేపండి. మీ వయస్సు 40 లోపు అయితే, విశ్రాంతి లేకుండా, ప్రతి కాలుతో విడివిడిగా 25 రెప్స్ చేయడానికి ప్రయత్నించండి.

4 / 5
శ్వాసకోశ కండరం: ఇది మన శ్వాస వ్యవస్థలో అత్యంత కీలకమైన కండరం. కానీ చాలామంది దీనిని పట్టించుకోరు. దీనివల్ల 70 ఏళ్ల వయసుకు వచ్చేసరికి ఇది తన శక్తిలో 30 శాతం కోల్పోతుంది. ఇది బలహీనపడితే ఊపిరితిత్తులను శుభ్రపరిచే దగ్గు తగ్గుతుంది. ప్రశాంతంగా లోతైన శ్వాస తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది.

5 / 5
దీనిని పరీక్షించడానికి, లోతైన శ్వాస తీసుకుని బిగపట్టండి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా 30 సెకన్ల పాటు శ్వాసను బిగపట్టగలిగితే, మీ డయాఫ్రమ్ సంపూర్ణంగా పనిచేస్తోందని అర్థం. మీ బయోలాజికల్ వయసును తగ్గించుకుని, ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలంటే ఈ 4 కండరాలకు క్రమంతప్పకుండా వ్యాయామం అందించడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఈ కండరాలను ఆరోగ్యంగా ఉంచే వ్యయామాలు చేస్తూ.. 60 ఏళ్ల తర్వాత కూడా మీరు బలంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Follow Us