
ఏప్రిల్ పూర్తి అయ్యి మే నెల రాబోతుంది. అయితే మే నెలలో కొన్ని గ్రహాల మార్పులు, కదలికల వలన మూడు రాశుల వారికి అనేక ఇబ్బందులు ఎదురు కానున్నాయంట. బంధాల్లో చీలికలు, ఆర్థిక, అనారోగ్యం వంటి సమస్యలు ఎక్కువ కానున్నాయంట. అందుకే ఏప్రిల్ చివరి వారం నుంచి, మే 11వ తేదీ వరకు మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి : కొన్ని్ గ్రహాల చెడు చూపు కారణంగా మేష రాశి వారు చాలా సమస్యలు ఎదుర్కోనున్నారు. అందుకే ఈ రాశి వారు మే 11 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. లేకపోతే అనే ఇబ్బందుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. హనుమంతుడిని పూజించడం వలన కాస్త ఉపశమనం కలుగుతుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు వ్యతిరేకంగా వచ్చే ఛాన్స్ ఉంది. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇంట్లో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. అందుకే చాలా వరకు జాగ్రత్తగా ఉండటం అవసరం. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఈ ప్రయాణాలు కూడా మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టివేస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త పనులు ప్రారంభించక పోవడమే మంచిది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు