అమెరికాలో తెలుగు సందడి.. ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు!

Updated on: Aug 08, 2026 | 8:45 AM

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ ఆటా మహాసభలు ముగిశాయి. ఈ వేడుక ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక మహాసభ. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, ముఖ్య ప్రముఖులు, కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

1 / 5

2 / 5
ఈ కార్యక్రమంలో సాంప్రదాయబద్ధంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. ఆటా కమిటీ మెంబర్స్ తో పాటు ముఖ్య అతిథులు ఈ  వేడుకలో పాల్గొన్నారు. ఈ మహాసభల్లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్,  రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు.

3 / 5
వీరితో పాటు కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బనాల, ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా వ్యవస్థాపక సభ్యుడు హనుమంత రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ ప్రసంగం హైలెట్ గా నిలిచింది.

4 / 5

ఆమె మాట్లాడుతూ " భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని, ఎన్నికల ప్రక్రియలో కూడా చురుగ్గా పాల్గొని సమాజ భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్రలో నిర్వహించాలని "  కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కీరవాణి సంగీతం కూడా అందర్ని అలరించింది.

5 / 5
మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, యువజన, మహిళా, వ్యాపార సదస్సులు, సాహిత్య వేదికలు, , పూర్వ విద్యార్థుల సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మహాసభలు తెలుగు సంస్కృతి వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చాయనే చెప్పుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us