‘లాలా.. ఐయామ్‌ సారీ’కి స్పందించిన అఫ్రిది… రవూఫ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్‌

సుల్తాన్స్‌ తరఫున బరిలోకి దిగిన వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రీదిని పేసర్‌ హారిస్‌ రౌఫ్‌ అద్భుత ఇన్‌స్వింగర్‌తో డకౌట్‌ చేశాడు. ఆ వెంటనే అఫ్రీదిపై ఉన్న గౌరవంతో అతడు రెండు చేతులూ జోడించి క్షమించమన్నట్టుగా చూశాడు.

  • Sanjay Kasula
  • Publish Date - 9:39 pm, Thu, 19 November 20
‘లాలా.. ఐయామ్‌ సారీ’కి స్పందించిన అఫ్రిది... రవూఫ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్‌

Shahid Afridi lauds : ఐపీఎల్ తరహాలో పాకిస్తాన్‌లో పీఎస్ఎల్ జరుగుతోంది. ఇందులో సరదా సంఘటన చోటు చేసుకుంది. రెండో ఎలిమినేటర్‌లో భాగంగా ఆదివారం రాత్రి లాహోర్‌ క్వాలాండర్స్‌-ముల్తాన్‌ సుల్తాన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సుల్తాన్స్‌ తరఫున బరిలోకి దిగిన వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రీదిని పేసర్‌ హారిస్‌ రౌఫ్‌ అద్భుత ఇన్‌స్వింగర్‌తో డకౌట్‌ చేశాడు. ఆ వెంటనే అఫ్రీదిపై ఉన్న గౌరవంతో అతడు రెండు చేతులూ జోడించి క్షమించమన్నట్టుగా చూశాడు. ఈ వీడియోను ‘లాలా.. ఐయామ్‌ సారీ’ అనే క్యాప్షన్‌తో పీఎ్‌సఎల్‌ పోస్ట్‌ చేయగా.. అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే తాజాగా తన ఔట్‌పై అఫ్రిది స్పందించాడు. రవూఫ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు. అది ఆడేందుకు సాధ్యం కాని గొప్ప యార్కర్‌. అద్బుతంగా బౌలింగ్‌ చేశావు రవూఫ్‌. తర్వాతిసారి నాకు కొంచెం స్లోగా బౌలింగ్‌ చెయ్‌. ఫైనల్స్‌కు వెళ్లిన ఖలందర్స్‌కు శుభాకాంక్షలు. మాకు మద్దతు తెలిపిన ముల్తాన్‌ సుల్తాన్స్‌ అభిమానులకు ధన్యవాదాలు అని అఫ్రిది ట్వీట్‌ చేశాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో లాహోర్‌ ఖలందర్స్‌ విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది.