కరోనా దెబ్బకు.. ప్రమాదంలో 29 లక్షలకు పైగా ఉద్యోగాలు..

కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఇప్పటికే సంక్షోభంలో పడిన భారత విమానయాన రంగంపై కరోనా వైరస్ దెబ్బ కోలుకోలేని విధంగా తాకనుంది. లాక్‌డౌన్

కరోనా దెబ్బకు.. ప్రమాదంలో 29 లక్షలకు పైగా ఉద్యోగాలు..
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 8:41 PM

కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఇప్పటికే సంక్షోభంలో పడిన భారత విమానయాన రంగంపై కరోనా వైరస్ దెబ్బ కోలుకోలేని విధంగా తాకనుంది. లాక్‌డౌన్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ఎయిర్లైన్ల సంస్థల ఆదాయాలు గణనీయంగా క్షీణించాయి. ఇది ఉద్యోగుల వేతనాల కోతకుదారి తీసింది. తాజా ఈ సంక్షోభం కారణంలో విమానయాన రంగం, సంబంధిత రంగాలలో 29 లక్షలకు పైగా ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుస్తోంది.

కాగా.. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. కోవిద్-19 సంక్షోభం వల్ల భారతదేశంలో 29,32,900 లక్షల ఏవియేషన్ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) తెలిపింది. అంతేకాకుండా, 2019తో పోలిస్తే 2020లో భారతదేశం విమాన ప్రయాణ డిమాండ్ సగానికి పడిపోనుందని అంచనావేసింది. ప్రయాణీకుల రద్దీలో 47 శాతం క్షీణత కనిపించనుంది. ఫలితంగా గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది రూ .85,000 కోట్లకు పైగా ఆదాయం తగ్గుతుందని ఐఏటీఏ పేర్కొంది.