పంటి పటుత్వానికి మూలిక..! సీఎం కేసీఆర్‌కే ఆఫర్‌ ఇచ్చిన వృద్దుడు

తినే అన్నంలో మనకు ఎప్పుడైనా చిన్న రాయి పట్టికి తగిలితేనే ప్రాణం పోయినంత పనవుతుంది..శరీరంలోని నరాలు మొత్తం జీవ్వుమని లాగేస్తాయి.. వెంటనే ఆ అన్నాన్ని చెత్తలో పడవేస్తాం. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఏకంగా పలుగు రాళ్లనే పరపర నమిలి మింగేస్తున్నాడు. అతని పంటి పటుత్వానికి అతని దగ్గర ఓ సిక్రేట్‌ ఉందంటున్నాడు. కావాలంటే..సీఎం కేసీఆర్‌ పిలిస్తే…కూడా వస్తానంటూ సవాల్‌ విసురుతున్నాడు. అవును ఇది నిజమే..సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో గల రగువత్తం గ్రామంలో నివసిస్తున్నాడు పెద్ద […]

పంటి పటుత్వానికి మూలిక..! సీఎం కేసీఆర్‌కే ఆఫర్‌ ఇచ్చిన వృద్దుడు
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 06, 2019 | 6:07 PM

తినే అన్నంలో మనకు ఎప్పుడైనా చిన్న రాయి పట్టికి తగిలితేనే ప్రాణం పోయినంత పనవుతుంది..శరీరంలోని నరాలు మొత్తం జీవ్వుమని లాగేస్తాయి.. వెంటనే ఆ అన్నాన్ని చెత్తలో పడవేస్తాం. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఏకంగా పలుగు రాళ్లనే పరపర నమిలి మింగేస్తున్నాడు. అతని పంటి పటుత్వానికి అతని దగ్గర ఓ సిక్రేట్‌ ఉందంటున్నాడు. కావాలంటే..సీఎం కేసీఆర్‌ పిలిస్తే…కూడా వస్తానంటూ సవాల్‌ విసురుతున్నాడు.
అవును ఇది నిజమే..సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో గల రగువత్తం గ్రామంలో నివసిస్తున్నాడు పెద్ద సత్తిరెడ్డి అనే 70 ఏళ్ల వృద్ధుడు.. ఇప్పుడు అతడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. పల్లీ, బఠాణీలు నమిలేసినట్లుగా పలుగు రాళ్లను నమిలేస్తున్నాడు..అయితే, దీని వెనక తనకు తెలిసిన ఓ మూలిక వైద్యం ఉందంటున్నాడు…కొద్ది రోజుల క్రితం తన దంతాలు వదులుగా మారిన ఇబ్బంది పడ్డానని, ఆ క్రమంలోనే తాను ఓ మూలికను కనుగొని తినటంతో తన పళ్లు పటిష్టంగా మారాయని చెబుతున్నాడు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా దంత సమస్యతో ఢిల్లీకి వెళ్లారని విన్నాను..అంటున్న సత్తిరెడ్డి కోరితే..కేసీఆర్‌కు కూడా తన దగ్గరున్న మూలికను ఇస్తానని చెబుతున్నాడు. దంతాల బలానికి కారణమైన తన మూలిక మెడిసిన్‌పై యాడ్‌ ఇచ్చేందుకు కూడా తాను సిద్దంగా ఉన్నానని సవాల్‌ చేస్తున్నాడు. సత్తిరెడ్డి చేస్తున్న సవాల్‌ను గ్రామస్తులు సైతం అంగీకరిస్తున్నారు. తనకు గల అద్భుత ప్రతిభను ప్రభుత్వం గుర్తించాలని
కోరుకుంటున్నారు.

Latest Articles
సెలవుల్లో టూర్‌కు వెళ్లాలా.? థాయ్‌లాండ్ ప్యాకేజీ తెలుసుకోండి
సెలవుల్లో టూర్‌కు వెళ్లాలా.? థాయ్‌లాండ్ ప్యాకేజీ తెలుసుకోండి
కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..? అద్భుతమైన చిట్కాలు
కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..? అద్భుతమైన చిట్కాలు
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..