ప్రేక్షకులు లేకుండానే.. ఖాళీ స్టేడియాల్లో.. ఐపీఎల్ మ్యాచ్‌లు..?

కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఖాళీ స్టేడియాల్లో క్రీడలను నిర్వహించుకోవాలని బీసీసీఐ సహా క్రీడా సమాఖ్యలకు కేంద్ర

ప్రేక్షకులు లేకుండానే.. ఖాళీ స్టేడియాల్లో.. ఐపీఎల్ మ్యాచ్‌లు..?
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 9:45 PM

కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఖాళీ స్టేడియాల్లో క్రీడలను నిర్వహించుకోవాలని బీసీసీఐ సహా క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంటే తాజా ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం అభిమానులకు లేనట్టే. ఈ చర్యలతో నష్టాలు వచ్చినా సరే ఎలాగైనా లీగ్‌ జరగడమే ముఖ్యమని ఫ్రాంచైజీ యాజమాన్యాలు అంటున్నాయి. ఐతే విదేశీ ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేసేలా కేంద్ర ప్రభుత్వంతో బీసీసీఐ చర్చించాలని కోరుతున్నాయి.

అయితే.. గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించకపోవడం నిరాశ కలిగించేదే. ‘టికెట్‌ విక్రయాలపై అతిగా ఆలోచించడం లేదు. ఎందుకంటే బీమా ఉంటుంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను అంటువ్యాధిగా ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించడం కన్నా మరో దారిలేదు. అంటే ఐపీఎల్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలి. అప్పుడు అభిమానులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలను చూస్తారు. అయితే ఏప్రిల్‌ 15 కన్నా ముందే విదేశీ ఆటగాళ్లు వచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో బీసీసీఐ చర్చించాలి. లేదంటే నష్టాలు మరింత పెరుగుతాయి’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి అన్నారు.