Village in Sand: దెయ్యాలు..భూతాలు ఇటువంటి వాటిని ప్రజలు బాగా నమ్ముతారు. నమ్మడమే కాదు అటువంటి విషయాల్లో చాలాసార్లు తీవ్ర భయాందోళనలకు గురి అవుతారు. ఎక్కడైనా ఒక వ్యక్తి ఇలా భయపడితే.. వెంటనే భూత వైద్యుడి దగ్గరకో.. లేకపోతే తమకు తెలిసిన ఎదో దిగదుడుపులాంటి ప్రక్రియలతోనో దానిని పోగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి భయాన్నే కొందరు తమకు అనుకూలంగా మలచుకుని ప్రజల దగ్గర సొమ్ములు గుంజుతారు. ఇది వ్యక్తిగతంగా ఉండే భయాల సంగతి. ఒక్కోసారి ఇది సామాజికంగా పుట్టుకొస్తుంది. ఒక దెయ్యం ఊరిలో వచ్చింది అనో.. రాత్రి పూట ఫలానా దగ్గరకు వెళితే భూతం పట్టేసుకుంటుంది అనో ఒక గ్రామం మొత్తం నిర్దారించేసుకుంటుంది. దీనికి సహేతుకమైన కారణాలు కనిపించవు. కేవలం భయంతోనే అలా జరుగుతుంది. చాలా చోట్ల ఇలా ఊరిలో దెయ్యం ఉందని ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయిన వారున్నారు. అలా శిధిలమైపోయిన ఊళ్లు కూడా ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు చెప్పబోతున్న ఒక ఊరి కథ కూడా అంతే!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అల్ మాడం అనే గ్రామం ఉంది. కాదు.. ఉండేది. ఎందుకంటే, కొన్నిరోజుల్లో ఊరంతా ఇసుకతో కప్పబడిపోబోతోంది. ఈ ఊరు దుబాయ్ కి ఒక గంట ప్రయాణ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ ఒకప్పుడు అంతా జనం ఉండేవారు. ఒకసారి ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. అసలు ఎందుకు అలా జరిగిందో ఎవరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. కానీ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాత్రం ఈ గ్రామంలో జిన్ ఉంటోంది అని చెప్పుకుంటున్నారు. అందుకే ఆ గ్రామంలోని ప్రజలు ఒక రాత్రిపూట పారిపోయారు అని అంటారు. అంతే కాదు.. మంత్రగత్తె నీడ ఆ గ్రామం మీద పడటంతో దానికి ఇటువంటి దుస్థితి వచ్చింది అని అంటారు. పిల్లి దృష్టి గల ఒక మంత్రగత్తె గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించింది అని చెబుతుంటారు. ఏదిఏమైనా కేవలం భయంతోనే ఆ ఊరిని వదిలి ప్రజలు పారిపోయారనేది నిజం.
ఇక ఈ ఊరు మొత్తం ఖాళీ కావడంతో.. దుబాయ్ కి దగ్గరగా ఉండటంతో ఈ ఊరిని చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు ఇక్కడికి. అయితే, ఈ ఊరు ఇలా ఖాళీగా ఉండిపోవడంతో ఇప్పుడు క్రమేపీ శిధిలం అయిపోతోంది. ఊరంతా ఇసుక కమ్మేసింది. ఇళ్ళల్లోని గదులన్నీ ఇసుకతో నిండిపోతున్నాయి. రాత్రి పూట అకస్మాత్తుగా ఊరినుంచి ప్రజలు పారిపోవడంతో చాలా ఇళ్ళలో ఫర్నీచర్ కూడా అలానే ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఫర్నీచర్ కూడా ఇసుకలో కూరుకుపోతోంది. కొన్ని రోజుల్లో ఈ ఊరు మొత్తం ఇసుకలో కప్పబడిపోయే అవకాశాలున్నాయి.
మూడంతస్థుల నుంచిమంటల్లో కిందికి దూకిన స్టంట్ మ్యాన్..!! చూస్తే షాక్…!! ఎక్కడంటే…?? ( వీడియో )