Healthy Relationship Tips: ఏదైనా బంధం దృఢంగా ఉండాలంటే దానికి ప్రేమ, నమ్మకం పునాదిగా చెప్పవచ్చు. మీరు ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లయితే కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా మీ సంబంధం ఎప్పటికీ బ్రేక్ అవదు.
బిజీ షెడ్యూల్..
సాధారణంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మీ భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. వారికి ఫోన్ చేసి యోగక్షేమాలు అడగడం, తిన్నారా? తాగారా? వంటి వివరాలు అడిగి తెలుసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ సంబంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవడానికి అవుతుంది. అయితే, బిజీగా ఉన్నామనే కారణంగా కనీసం పట్టించుకోకపోవడం అసలుకే మోసం తెస్తుంది. మీకు కాల్ చేయడానికి వీలు కాకపోతే.. మెసేజ్ పెట్టండి. మీ బిజీ షెడ్యూల్ గురించి వారికి తెలుపండి. అలా చేస్తే.. మీ భాగస్వామి మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. మీరు వారిని పట్టించుకోవడం లేదనే భావన నుంచి బయటకు వస్తారు.
సమయం కేటాయించకపోవడం..
మీరు కొత్తగా ఒక్కటైన జంట అయితే.. మీ భాగస్వామిని కలవడానికి ఎక్కువ సమయం కేటాయించండి. ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాదు.. ఇద్దరి మధ్య స్నేహ సంబంధం పెరుగుతుంది. టైమ్ కేటాయించకపోవడం వల్లే ఎన్నో జంటలు విడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
అతి ప్రమేయం..
ఎవరికైనా తమ భాగస్వామి తమ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే, వారికి వ్యక్తిగత జీవితం, హాబీలు ఉండవని కాదు. వారికి ప్రైవసీ కోసం కొంత సమయం ఇవ్వండి. వారి జీవితంలోకి పరిమితికి మించి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే.. మీ బంధానికి బీటలువారే ప్రమాదం ఉంది.
ఫోన్ చిచ్చు..
ఈ మధ్య కాలంలో మనుషుల మధ్య మాటలు తగ్గిపోయి.. ఫోన్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ విధానం కూడా పెద్ద తప్పు. ఫోన్ కోసం కొంత సమయం కేటాయించి.. మిగతా సమయాన్ని భాగస్వామికి కేటాయించాలి. వారితో మాట్లాడాలి. వారితో ఆలోచనలను పంచుకోవాలి. వారి మాటలను జాగ్రత్తగా వినాలి. కొంతమంది వ్యక్తులు తమ భాగస్వామితో కూర్చున్నప్పుడు కూడా ఫోన్‌నే పట్టుకుని వేలాడుతుంటారు. వారు ఎంత మాట్లాడుతున్నప్పటికీ పెద్దగా పట్టించుకోరు. అలాంటి పరిస్థితిలో ఆ బంధంలో పొరపొచ్చాలు వచ్చే ఆస్కారం ఉంది. ఇద్దరూ విడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
కాబట్టి.. ఈ విషయాలను దృష్టిమీరు మీ భాగస్వామితో సరదాగా గడపండి. భాగస్వామికి కొంత సమయం కేటాయించండి. వారితో ముచ్చటించండి, సరదాగా ఉండండి. మీ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోండి.
Also read:
Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్
MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు