Worlds Deadliest Animal: ప్రకృతి అందాలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. మన కళ్లకు అందంగా, చూడటానికి వింతగా కనిపిస్తే వెంటనే మనసు ఆటోమేటిక్‌గా వాటివైపు అడుగులు వేస్తాం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ఏదైనా కిద్దిపాటి వింతగా కనిపించినా చాలు.. దాంతో సెల్ఫీలు దిగుతారు జనాలు. ప్రాచనీ కట్టడాలు గానీ, వస్తువులు గానీ, చెట్లు, పుట్టలు, జంతువులు ఇలా ఒకటేమిటి.. మనిషికి ఆహ్లాదం, ఆనందాన్ని కలిగించే ప్రతిదాన్ని కెమెరాలో బందించడం అలావాటైపోయింది. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ సముద్ర తీరంలో కనిపించిన సాలీడు పురుగును పోలిన చిన్నపాటి వింత జీవిని చేతిలో పట్టుకుంది. అయితే ప్రాణాంతక జీవి అని తెలుసుకుని వెంటనే కింద పడేసింది. క్షణం ఆలస్యమైనా ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే అని స్వయంగా తన అనుభవాన్ని చెబుతోంది ఆ మహిళ. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాకు చెందిన ఓ మహిళ ఇండోనేషియాలో బాలీ ద్వీపానికి టూరిస్టుగా వచ్చింది. ఆ సందర్భంగా అక్కడి బీచ్‌లో సరదాగా గడుపుతుండగా.. సముద్రం ఒడ్డున సాలీడు పురుగులాంటి/ఆక్టోపస్ లాంటి వింత జీవి ఒకటికి ఆమె కంట పడింది.
అది చూడటానికి వింతగా ఉండటంతో ముచ్చటపడిన ఆ మహిళ.. దాన్ని చేతిలోకి తీసుకుని ఫోటోలు దిగింది. ఈ వింత జీవి ఏంటి? అని తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్ చేసింది. అందులో వచ్చిన రిజల్ట్స్ చూసి మహిళ హడలిపోయింది. కారణం.. ఆమె పట్టుకున్న జీవి అత్యంత ప్రమాదకర జీవి అట. ఆ విషం ద్వారా నిమిషాల వ్యవధిలోనే 26 మంది చంపగలదని గూగుల్ సెర్చ్‌లో తేలింది. వెంటనే తేరుకున్న సదరు మహిళా పర్యాటకురాలు.. దానిని తక్షణమే కింద పడేసింది. టైమ్ బాగుంది కాబట్టి ఆ జీవి ఆమెను ఏం అనలేదు. లేకుంటేనా ఆమె ప్రణాలు కూడా గాల్లో కలిసిపోయేవే. అయితే, తాను ఫేస్ చేసిన భయానక సన్నివేశం గురించి సదరు మహిళ సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వింత జీవి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ మహిళ.. అది ఎంత ప్రమాదకరమైన జీవో పేర్కొంది. కాగా, సదరు మహిళన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తమదైన స్టైల్‌లో చిత్ర విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు.
Also read:
Corona Effect: వారందరికీ ఫ్రీ.. కరోనా సంక్షోభం వేళ శుభవార్త చెప్పిన ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ..