Viral Video: ఏనుగమ్మా ఏనుగు.. పాలు తాగుతూ ఆటలాడుకున్న చిన్నారి.. షాకింగ్ వీడియో

Girl Drinks Elephant Milk: హృదయాన్ని తాకే దృశ్యం మరొకటి కెమెరా కంటికి చిక్కింది. అస్సాంకు చెందిన మూడేళ్ల బాలిక ఏనుగు

Viral Video: ఏనుగమ్మా ఏనుగు.. పాలు తాగుతూ ఆటలాడుకున్న చిన్నారి.. షాకింగ్ వీడియో
Girl Drinks Elephant Milk

Updated on: Jan 30, 2022 | 5:32 PM

Girl Drinks Elephant Milk: హృదయాన్ని తాకే దృశ్యం మరొకటి కెమెరా కంటికి చిక్కింది. అస్సాంకు చెందిన మూడేళ్ల బాలిక ఏనుగు పాలు తాగుతూ కనిపించింది. బాలిక హర్షిత బోరా స్వస్థలం ఎగువ అస్సాంలోని గోలాఘాట్ జిల్లా. చిన్నారి (Girl) ఏనుగుతో ఆడుకుంటూ దాని పాలు తాగుతుండటాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఏనుగు (Elephant) కూడా బాలిక ఉనికిని అర్థం చేసుకొని.. మాతృత్వాన్ని చూపించింది. బాలిక పాలు తాగుతున్న క్రమంలో ఏనుగు ఏమనకుండా నిలబడి అలానే ఉంటుంది. ఈ వీడియోలో హర్షిత ఏనుగుతో ఆడుకోవడాన్ని కూడా మనం చూడవచ్చు. ఏనుగు కిందకు దూరి బాలిక అటు ఇటు పరుగులు తీస్తుంటుంది. అయితే.. చిన్నారి ఏనుగులను బిను అని పిలుస్తుంది.

ఈ వైరల్ వీడియోలో బిను, హర్షిత కలిసి తమ సమయాన్ని ఆస్వాదిస్తుండటాన్ని చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అస్సాంలోని గోలాఘాట్ జిల్లా, ఇతర ప్రాంతాలలో ఏనుగు-మనుషుల గొడవలు పెరుగుతున్న తరుణంలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి..

వైరల్ వీడియో..

సోషల్ మీడియా ప్రపంచంలో ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిని చూసి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తుంటారు. అయితే.. ఇంతకు ముందు కూడా కుక్కలు, పిల్లులు, కోతులు, పలు జంతువులు.. సాటి జంతువుల పాలు తాగుతూ కనిపించిన దృశ్యాలను మనం చాలానే చూశాం.. ప్రస్తుతం చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read:

Crime News: ప్రేమించి పెళ్లి చేసుకొని.. విడాకులిచ్చాడు.. చివరకు కోపంతో మాజీ భార్యపై..

Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..