త‌స్మాత్ జాగ్ర‌త్త ! క‌రోనాతో వారికే అధిక ముప్పు ?

కోవిడ్ మ‌హ‌మ్మారి ప్రాణాంత‌క‌త‌ను క‌లిగించ‌డ‌మే కాక ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కూడా చిన్నాభిన్నం చేసింది. ఇటువంటి త‌రుణంలో క‌రోనా వైర‌స్

త‌స్మాత్ జాగ్ర‌త్త ! క‌రోనాతో వారికే అధిక ముప్పు ?
Follow us

|

Updated on: May 04, 2020 | 1:59 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా మాన‌వ‌ళి మ‌నుగ‌డ‌కే క‌రోనా స‌వాలుగా మారింది. కోవిడ్ మ‌హ‌మ్మారి ప్రాణాంత‌క‌త‌ను క‌లిగించ‌డ‌మే కాక ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కూడా చిన్నాభిన్నం చేసింది. ఇటువంటి త‌రుణంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి, నివార‌ణ చ‌ర్య‌ల‌పై ప్ర‌పంచ ప‌రిశోధ‌కులు అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వైర‌స్ కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు తాజా ఫ‌లితాలు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల్లో వైర‌స్ కార‌ణంగా మ‌హిళ‌ల‌కు ముప్పు త‌క్కువ‌గా ఉంటుంద‌నే విష‌యం వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజ‌గా మ‌రో అధ్య‌య‌నం బ‌య‌ట‌పెట్టారు శాస్త్ర‌వేత్త‌లు. ఆ నివేధిక మేర‌కు…
కరోనా వైరస్ మహిళల కంటే పురుషులకే ఎక్కువ గా ముప్పు ఉంటుందని,  ఊబకాయం ఉన్న వారిపై తీవ్రత అధికంగా ఉంటుందని ఒక సర్వే తెలిపింది. లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడటం మరణించడం జరుగుతుందని ఆ సర్వే పేర్కొంది. కొందరు కరోనా సోకినా ప్రాణాలతో బయటపడే పరిస్థితి ఉంటుందని స‌ర్వే వెల్ల‌డించింది. ఈ తరుణంలో వైరస్ కారణంగా ఎవరు ఎక్కువగా మరణించే అవకాశం ఉంది అనే దాని మీద ఒక సర్వే చేసారు. ఊబకాయం ఉన్నవారికి వైరస్‌ సోకితే మరణించే ముప్పు ఎక్కువగా ఉంటుందనీ,  ఈ వైరస్  కారణంగా ముఖ్యంగా పురుషులకే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని ఆ సర్వే వెల్లడించింది.