రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పై 12 పార్టీల అవిశ్వాస తీర్మానం

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పై 12 పార్టీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చాయి. రైతు బిల్లులపై తాము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ సభ చేత వీటిని ఆమోదింపజేశారని టీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు..

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పై 12 పార్టీల అవిశ్వాస తీర్మానం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 20, 2020 | 4:23 PM

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పై 12 పార్టీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చాయి. రైతు బిల్లులపై తాము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ సభ చేత వీటిని ఆమోదింపజేశారని టీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు విమర్శించాయి. రైతులతో గానీ విపక్షాలతో గానీ సంప్రదించకుండా  ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకుందని తెరాస ఎంపీ కేకే ఆరోపించారు. కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేందుకే ఈ బిల్లులని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందన్నారు. వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేసే యత్నాన్ని తాము ప్రతిఘటిస్తామని ఆయన చెప్పారు. ఇతర పార్టీలు కూడా ఆయనతో ఏకీభవించాయి.