పుల్వామా ఉగ్రదాడిపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిపై జాతీయదర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)విచారణ చేపట్టింది. ఈ కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. హోంశాఖ ఆదేశాలతో ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టింది. ఫొరెన్సిక్ బృందం సహాయంతో ఎన్ఐఏ పలు ఆధారాలను సేకరించింది. ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఉగ్రదాడి కారణంగా 40 మందికి పైగా సీఆర్పిఎఫ్‌ జవాన్లు కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాడి చేసింది తామేనని పాకిస్థాన్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పాకిస్థాన్ ప్రమేయం ఉందని […]

పుల్వామా ఉగ్రదాడిపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 9:13 PM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిపై జాతీయదర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)విచారణ చేపట్టింది. ఈ కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. హోంశాఖ ఆదేశాలతో ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టింది. ఫొరెన్సిక్ బృందం సహాయంతో ఎన్ఐఏ పలు ఆధారాలను సేకరించింది. ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఉగ్రదాడి కారణంగా 40 మందికి పైగా సీఆర్పిఎఫ్‌ జవాన్లు కన్నుమూసిన సంగతి తెలిసిందే.

దాడి చేసింది తామేనని పాకిస్థాన్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పాకిస్థాన్ ప్రమేయం ఉందని భారత దేశం ఆరోపిస్తోంది. కానీ పాక్ మాత్రం తమకు సంబంధం లేదని, ఆధారాలు ఉంటే చూపించాలని వాదిస్తోంది. గతంలో ఎన్ని ఆధారాలిచ్చినా పట్టించుకోలేదని, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తామే చేశామని స్వయంగా ప్రకటించినప్పుడు ఇంకేం ఆధారాలు కావాలని పలువురు భారత దేశ నాయకులు పాక్‌కు కౌంటరిచ్చారు.