
భారత-చైనా దళాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ప్రధానంగా ఇందుకు దారి తీసిన పరిస్థితులపై జర్మన్ విశ్లేషకుడొకరు కూలంకషంగా స్పందించారు. ఈ రెండు దేశాల మధ్య గల ద్వైపాక్షిక సంబంధాలను గురించి ఏండ్రు స్మాల్ అనే ఆయన.. పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఈ కరోనా కాలంలో తన పొరుగు దేశాలన్నింటితో సఖ్యతగా ఉండాలనే చైనా భావిస్తోందని, అయితే కరోనా కారణంగా తన ఆర్థిక పరిస్థితి దిగజారవచ్ఛుననన్న ఆందోళనతో అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కొంత కఠినంగా వ్యవహరించి ఉండవచ్ఛునని అభిప్రాయపడ్డారు. బహుశా తమ దేశ ప్రజలనుంచి వఛ్చిన ఒత్తిడి కూడా ఇందుకు కారణమై ఉండవచ్చునని సైతం ఆయన తన ఆర్టికల్ లో పేర్కొన్నారు. 1962 లోను, ఆ తరువాత 1967 లోను భారత్-చైనా మధ్య యుధ్ధాలు జరిగాయి. కానీ తమ బోర్డర్ సమస్యలను ఆ దేశాలు దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోగలిగాయి.. అంతే తప్ప నిజంగా ప్రస్తుతానికి జీ జిన్ పింగ్ గానీ,, భారత ప్రభుత్వం గానీ వార్ పై దృష్టి పెట్టలేదు అనిఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకు అవరోధం రాకూడదన్నదే ఈ దేశాధినేతల ఉద్దేశంలా కనిపిస్థోందన్నారు. లదాఖ్ లోని డీ ఫాక్టో బోర్డర్ లో ఇండో-చైనా దళాల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణను ప్రస్తావించిన ఏండ్రు.. ఆ ప్రాంతంలో చైనా దళాల నిర్మాణాలను శాటిలైట్ ఇమేజీలు స్పష్టం చేశాయన్నారు. రెండు దేశాల సైనికులూ సంయమనంతో వ్యవహరించి ఉంటే ఇంత ఘర్షణ జరిగి ఉండేది కాదన్నారు.