PUBG Love: పబ్జీ కలిపిన బంధం.. ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చేసింది..!

Noida: ప్రేమ గుడ్డిదంటారు. దానికి అందం, కులం, మతం, ఆస్తి, అంతస్తు ఏదీ అక్కర్లేదు. ఇక యవస్సతోనూ నిమిత్తం లేదు. ఏ దేశమైనా, ఏ వయసు వారైనా ప్రేమలో పడాల్సిందే. తాజాగా ఇందుకు నిదర్శనమైన, ఇంట్రస్టింగ్ ఘటన వెలుగు చూసింది.

PUBG Love: పబ్జీ కలిపిన బంధం.. ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చేసింది..!
Pakistan Love

Updated on: Jul 04, 2023 | 6:35 AM

Noida: ప్రేమ గుడ్డిదంటారు. దానికి అందం, కులం, మతం, ఆస్తి, అంతస్తు ఏదీ అక్కర్లేదు. ఇక యవస్సతోనూ నిమిత్తం లేదు. ఏ దేశమైనా, ఏ వయసు వారైనా ప్రేమలో పడాల్సిందే. తాజాగా ఇందుకు నిదర్శనమైన, ఇంట్రస్టింగ్ ఘటన వెలుగు చూసింది. భారత్‌కు చెందిన వ్యక్తితో ప్రేమలో పడిన పాకిస్తాన్ మహిళ తన నలుగురు పిల్లలను వెంట తీసుకుని ఇక్కడకు వచ్చేసింది. అయితే, వీరి ప్రేమకు చట్టాలు అడ్డు వచ్చాయి. దాంతో వీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్.. గ్రేటర్ నోయిడాకు చెందిన సచిన్‌ను పబ్జీ గేమ్ కలిపింది. పబ్జీ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయమవగా.. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ మరింత గాఢంగా మారి.. ఏకంగా సరిహద్దులు దాటేలా చేసింది. అప్పటికే వివాహమైన సీమా తన నలుగురు పిల్లలను తీసుకుని ప్రియుడి కోసం పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చేసింది. అయితే, ఆమె పాకిస్తాన్‌ నుంచి నేపాల్ వెళ్లి, అక్కడి నుంచి భారత్‌లోకి ప్రవేశించింది.

అయితే, సీమా పాకిస్తాన్ పౌరురాలని గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. సీమా.. సచిన్‌తో కలిసి ఏదైనా కుట్రలు చేస్తుందా? అన్న అనుమానంతో ఆమెను విచారిస్తున్నారు భద్రతా సిబ్బంది. అయితే, ఎంక్వైరీలో ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు పోలీసులు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..