ఏ పొదల్లోంచి ప్రమాదం ముంచుకొస్తుందో ? ఎటువైపు నుంచి మృత్యువు దాడి చేస్తుందో ? అని హడలిపోతున్నారు ముంబైవాసులు. చిరుత సంచారం.. ఆ ప్రాంతంలో జనానికి కంటి మీద కరువైన కనుకులేకుండా చేస్తోంది. ఇది.. ఒక్కో రోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా రెండేళ్లు. ఎప్పుడు ఎక్కడ కనిపిస్తుందో తెలియదు. ఎటు వైపు నుంచి దాడి చేస్తుందో తెలియదు. జనం అనేక మార్లు ఫిర్యాదులు.. దాన్ని పట్టుకునేందుకు సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలా మూడు రోజుల్లోనే రెండవ సారి దాడి చేసింది.
ముంబైలోని ఆరే కాలనీలో 64 ఏళ్ల మహిళపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో మహిళ గాయపడి ఆసుపత్రిలో పొందుతున్నారు. కానీ గాయపడకముందు ఆ మహిళ చేసిన సహసాన్ని స్థానికులతోపాటు నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. చిరుత పులి పేరు చెబితేనే వణుకుతో పరుగులు పెడతాం. అలాంటి చిరుత ఓ వృద్ధురాలిపై దాడి చేయబోగా ఆమె చాకచక్యంతో దాన్ని తప్పించుకుంది. కేవలం చేతి కర్ర సహాయంతో తరిమివేసింది. చిరుతనే పరుగులు పెట్టించింది. ఈ ప్రాంతంలో చిరుత దాడి చేయడం గత 15 రోజుల్లో ఇది ఆరోసారి.
ఈ సంఘటన బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గోరేగావ్ (తూర్పు) లోని ఆరే కాలనీ సీఈఓ కార్యాలయం సమీపంలో జరిగింది. 64 ఏళ్ల వృద్ధురాలు తన ఇంటి వెలుపల వరండాలో కూర్చుని ఉంది. అదే సమయంలో అకస్మాత్తుగా వెనుక నుండి చిరుత దాడి చేసింది. దాడి చేసిన వెంటనే రియక్ట్ అయ్యింది వృద్ధురాలి. తన చేతి కర్రను చిరుతపులి నోటిపై కొట్టింది. ఆ మహిళ దాడి చేస్తుండటంతో వెంటనే పారిపోయింది చిరుత. చిరుత ఆరుపులతో చుట్టు పక్కల ఉండే జనం బయటకు వచ్చారు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మహిళ స్వల్పంగా గాయపడింది. చిరుత దాడిలో గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిర్మలా దేవీ ముఖం, కాలికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
చిరుతపులి వృద్ధురాలిపై దాడి చేసిన వీడియోను ఇక్కడ చూడండి..
ఆరే కాలనీ ప్రక్కనే బోరివలి నేషనల్ పార్క్ ఉంది. అక్కడ చిరుతలు తరచుగా నివాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. జాతీయ ఉద్యానవనానికి దగ్గరగా ఉన్నందున ఆరే కాలనీ జనాభా ఎక్కవగా కనిపించదు. రాత్రి సమయంలో ఈ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని స్థానిక ప్రజల డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: IPL srh vs csk Match Prediction: చెన్నైతో సై అంటే సై.. విజయోత్సాహంతో దూకుడుమీదున్న హైదరాబాద్