Video Viral: ఒంటరిగా ఉంది కదా అని చోరీకి ప్రయత్నించాడు.. ఆమె చేసిన పనికి బెంబేలెత్తి పరుగు అందుకున్నాడు..

|

Sep 08, 2022 | 9:06 PM

దొంగతనాలు, దారుణాలు సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాత్రి (Night) సమయంలోనే కాకుండా పట్టపగటి వేళల్లోనూ కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే చాలు.. హఠాత్తుగా దాడి చేసి, ఉన్నదంతా..

Video Viral: ఒంటరిగా ఉంది కదా అని చోరీకి ప్రయత్నించాడు.. ఆమె చేసిన పనికి బెంబేలెత్తి పరుగు అందుకున్నాడు..
Attack On Thief
Follow us on

దొంగతనాలు, దారుణాలు సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాత్రి (Night) సమయంలోనే కాకుండా పట్టపగటి వేళల్లోనూ కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే చాలు.. హఠాత్తుగా దాడి చేసి, ఉన్నదంతా లాక్కొని పరారవుతున్నారు. ఇక అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే ఊరుకుంటారా.. అదీ రాత్రి సమయంలో.. ఇంకేముంది ఇదే అవకాశంగా భావించి, వారిపై దాడి చేసి పారిపోయే ఘటనలు ఎన్నో చూశాం. కొన్ని సందర్భాల్లో వారిని లైంగికంగా వేధించడం, అత్యాచారం చేయడం వంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. ప్రస్తుతం దేశ రాజదాని ఢిల్లీలో (Delhi) అలాంటి ఘటనే జరిగింది. రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఇక ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. దెబ్బకు ఆ దొంగ తోక ముడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది.

ఢిల్లీలోని బదర్‌పూర్ ప్రాంతంలో తన స్నేహితుడి వద్దకు వెళ్లిన సమయంలో తన ఫోన్‌ను దొంగిలించడానికి ప్రయత్నించిన మొబైల్ స్నాచర్‌తో ఓ మహిళ ధైర్యంగా పోరాడింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. సెప్టెంబరు 4న బదర్‌పూర్ ప్రాంతంలోని తన స్నేహితుల్లో ఒకరి వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. వీడియోలో, స్నాచర్ మహిళను అనుసరిస్తున్నట్లు చూడవచ్చు. తరువాత అతను ఆమె ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ మహిళ ఎదురుతిరిగింది. తరువాత మొబైల్ స్నాచర్ స్పాట్ నుంచి పారిపోయాడు. వైరల్ అవుతున్న క్లిప్ ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, యూ ట్యూబ్ సహా అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..