WITT Summit 2026: మార్చి 23-24 తేదీల్లో Tv9 నెట్‌వర్క్‌ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ సమ్మిట్.. హాజరు కానున్న మోదీ

WITT Summit 2026: ఈ సమ్మిట్‌లో క్రీడారంగానికి కూడా పెద్దపీట వేశారు. భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీతో పాటు యువ క్రికెటర్లు అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ పాల్గొంటారు. మహిళా క్రికెట్ జట్టు తరపున దీప్తి శర్మ, కోచ్ ఆవిష్కర్ సాల్వి కూడా..

WITT Summit 2026: మార్చి 23-24 తేదీల్లో Tv9 నెట్‌వర్క్‌ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ సమ్మిట్.. హాజరు కానున్న మోదీ
Witt Summit 2026

Updated on: Mar 21, 2026 | 9:48 PM

WITT Summit 2026: దేశ రాజధాని వేదికగా టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ (WITT) సమ్మిట్ నాలుగో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. మార్చి 23, 24 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరుగనుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం:

ఈ రెండ్రోజుల సదస్సులో అత్యంత కీలక ఘట్టం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చే కీలక ప్రసంగం. టీవీ9  ఈ ఐడియాస్ కార్నివాల్‌లో ప్రధాని పాల్గొనడం ఇది వరుసగా మూడవసారి. భారతదేశ అభివృద్ధి పథం, ప్రపంచ వేదికపై దేశం పోషిస్తున్న పాత్ర గురించి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

రెండో రోజు: రాజకీయ దిగ్గజాల మేధోమథనం:

తొలిరోజు ప్రధాని ప్రసంగం తర్వాత రెండో రోజు కూడా అదే స్థాయి ఉత్సాహంతో కొనసాగనుంది. దేశంలోని అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ఈ వేదికపై తమ గళాన్ని విప్పనున్నారు.

కేంద్ర మంత్రులు:  ఈ సమ్మిట్ కు పీయూష్ గోయల్ (వాణిజ్య, పరిశ్రమల శాఖ), జ్యోతిరాదిత్య సింధియా (కమ్యూనికేషన్స్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ), మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తమ ఆలోచనలను పంచుకుంటారు.

రాష్ట్రాల ప్రతినిధులు: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తమ రాష్ట్రాల ప్రగతి, దేశ వృద్ధిలో వాటి భాగస్వామ్యం గురించి ప్రసంగించనున్నారు.

ప్రతిపక్ష నేతలు: ఎంపీలు అఖిలేష్ యాదవ్, అసదుద్దీన్ ఒవైసీలు ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై ప్రసంగించనున్నారు.

అంతర్జాతీయ, మేధోపరమైన చర్చలు:

భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ప్రత్యేక సెషన్‌లో పాల్గొని అంతర్జాతీయ సంబంధాల ప్రాముఖ్యతను వివరించనున్నారు. అలాగే, ప్రముఖ బిజినెస్ గురువు ప్రొఫెసర్ రామ్ చరణ్, ప్రముఖ కవి కుమార్ విశ్వాస్ తమ విలక్షణమైన ప్రసంగాలతో సదస్సుకు మరింత వన్నె తేనున్నారు.

క్రీడా దిగ్గజాల సందడి:

ఈ సమ్మిట్‌లో క్రీడారంగానికి కూడా పెద్దపీట వేశారు. భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీతో పాటు యువ క్రికెటర్లు అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ పాల్గొంటారు. మహిళా క్రికెట్ జట్టు తరపున దీప్తి శర్మ, కోచ్ ఆవిష్కర్ సాల్వి కూడా ఈ మేధోమథన వేదికపై కనిపించనున్నారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం ఒక బ్లూప్రింట్‌ను రూపొందించే లక్ష్యంతో రాజకీయ, వ్యాపార, క్రీడా, సామాజిక రంగాల మేధావులను ఒకే చోటకు చేర్చుతున్న ‘వాట్ ఇండియా థింక్స్ టుడే 2026’, దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన ఆలోచనా వేదికగా నిలవబోతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఆలోచనాత్మక చర్చలతో ‘వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ 2026’ దేశ భవిష్యత్ దిశపై స్పష్టత ఇచ్చే వేదికగా నిలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us