అయోధ్య, నాటి రథయాత్రలో పదిమంది ‘చాంపియన్స్’ !

| Edited By: Anil kumar poka

Aug 05, 2020 | 11:22 AM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ 1990 లోనే ఉద్యమం సాగించారు. గుజరాత్ లోని సోమనాథ్ నుంచి అయోధ్య లోని రామజన్మ భూమి స్థలం వరకు రామ రథయాత్ర నిర్వహించారు.

అయోధ్య, నాటి రథయాత్రలో  పదిమంది చాంపియన్స్ !
Follow us on

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ 1990 లోనే ఉద్యమం సాగించారు. గుజరాత్ లోని సోమనాథ్ నుంచి అయోధ్య లోని రామజన్మ భూమి స్థలం వరకు రామ రథయాత్ర నిర్వహించారు. అయితే అయోధ్య చేరుకోక ముందే ఆయనను అప్పటి బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సమస్తిపూర్ లో అరెస్టు చేశారు. కాగా-ఆ యాత్రలో ప్రమోద్ మహాజన్, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, సాధ్వి రితంభర, ప్రవీణ్ తొగాడియా, కళ్యాణ్ సింగ్, విష్ణు హరిదాల్మియా వంటి వీహెచ్ పీ , బజరంగ్ దళ్ నేతలెందరో పాల్గొన్నారు.   నాడు అదొక మహోద్యమమైంది.

ఆ తరువాత రెండేళ్లకు 1992 లో అయోధ్యలోని బాబరీ మసీదును అద్వానీ, ఉమాభారతి లాంటి నేతల ఆధ్వర్యంలో కరసేవకులు కూల్చివేశారు. ఆ కేసులో వీరు ఇప్పటికీ నిందితులుగా ఉన్నారు.