
అయోధ్యలో నిర్మించదలచిన రామాలయ డిజైన్ ని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. మూడు అంతస్థుల కట్టడంపై పిల్లర్లు, మండప ద్వారాల నమూనా ఆకట్టుకుంటోంది. 161 అడుగుల ఎత్తున ఆలయం నిర్మితం కానుంది. ఆలయ శిల్ప కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ చంద్రకాంత సోంపురను ఆలయ డిజైన్ రూపొందించవలసిందిగా సుమారు 30 ఏళ్ళ క్రితమే కోరారట.ఆయన తండ్రి ప్రభాశంకర్ సోంపుర ఈ డిజైన్ తో బాటు సోమనాథ ఆలయ పునర్నిర్మాణ బాధ్యతను కూడా పర్యవేక్షించారు.
తాను ‘నగర’స్టయిల్’ ను పాటిస్తున్నానని సోంపుర తెలిపారు. ఎక్కువమంది భక్తుల ప్రవేశానికి అనుకూలంగా రెండు మండప ద్వారాల బదులు అయిదు మండప ద్వారాలనునిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ బుధవారం ఇక్కడ భూమిపూజ నిర్వహించనున్నారు.