
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజం చేయడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభమయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జాతీయ జెండాను రాహుల్‌కు అందించి యాత్రను ప్రారంభించారు. రాహుల్ వెంట 117 మంది నేతలు పాదయాత్ర చేస్తున్నారు. యాత్ర సందర్భంగా 150 రోజుల పాటు కంటేనర్‌లో బస చేస్తారు రాహుల్. కార్యకర్తల కోసం తాత్కాలిక టెంట్లు ఉంటాయి. రోజుకు సగటున 25 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. 5 నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3,570 కిలోమీటర్లు పొడవునా కొనసాగనుంది.
భారత్ జోడో యాత్రంలో రాహుల్ గాంధీ వెంట వివిధ రాష్ట్రాలకు చెందిన 117 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. ఈ 117 మందిని భారత్ యాత్రీస్ అని పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సుంకర పద్మశ్రీ పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి కేతూరి వెంకటేశ్, సంతోష్, కె.వెంకటరెడ్డి, కత్తి కార్తీక, బెల్లయ్య నాయక్ అనులేఖ రాహుల్ తో పాటు ముందుకు సాగుతారు.
వివిధ రాష్ట్రాల నుంచి 32 మంది మహిళలకు యాత్రలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. యాత్రలో రాహుల్ గాంధీ ఎక్కడా హోటల్, ఏసీ బస్సుల్లో బస చేయరు. తాత్కాలికంగా ఏర్పాటు చేసే వసతుల్లోనే ఆయన బస చేస్తారు. పాదయాత్రలో సభలు, సమావేశాలు ఉంటాయి. ఇందులో పలు చోట్ల సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారు.
పాదయాత్రకు ముందు కన్యాకుమారి లోని వివేకానంద మెమోరియల్‌ను రాహుల్ సందర్శించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టడానికే ఈ యాత్రను చేపట్టినట్టు రాహుల్ ప్రకటించారు.
– ట్యాగ్‌లైన్ – కలిసినడుద్దాం.. ఏకం చేద్దాం..
రాహుల్‌తో పాటే.. 119 మంది భారత్ యాత్రీస్ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇందులో పాల్గొంటారు. 150 రోజుల్లో 3500 కిలోమీటర్లపాటు ఈ యాత్ర చేపడతారు. అడుగు అడుగు కలిసి నడిచి- ఐకమత్యపు గొంతకను వినిపిద్దామంటూ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ప్రతిరోజు రోజూ రెండు భాగాలుగా ఈ యాత్ర కొనసాగుతుందని, ఉదయం 7 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పాదయాత్ర నిర్వహిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రోజూ సగటున 22 నుంచి 23 కిలోమీటర్ల చొప్పున మొత్తం 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని వివరించారు. ప్రధాన యాత్రకు అనుబంధంగా ఆయా రాష్ట్రాల్లో చిన్న జోడో యాత్రలు నిర్వహిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం