West Bengal: అర్థరాత్రి గుడిలో కారు డ్రైవర్‌తో బీజేపీ ఎమ్మెల్యే చందన బౌరి పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే..!

|

Aug 21, 2021 | 12:31 PM

West Bengal: కూలీ స్థాయి నుంచి చట్ట సభలకు ఎన్నికై.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే చందన బౌరి..

West Bengal: అర్థరాత్రి గుడిలో కారు డ్రైవర్‌తో బీజేపీ ఎమ్మెల్యే చందన బౌరి పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే..!
Bjp Mla
Follow us on

West Bengal: కూలీ స్థాయి నుంచి చట్ట సభలకు ఎన్నికై.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే చందన బౌరి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె సెక్యూరిటీ సిబ్బందిలోని ఓ వ్యక్తి భార్య.. ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే చందన బౌరి తన భర్తను వివాహం చేసుకుందంటూ ఆరోపించింది. సల్టోరా ఎమ్మెల్యే చందన బౌరి వద్ద తన భర్త కృష్ణ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, వీరిద్దరూ గురువారం రాత్రి 3.30 గంటలకు ఆలయంలో పెళ్లి చేసుకున్నారని డ్రైవర్ కృష్ణ భార్య ఆరోపించింది. ఈ వార్త ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆరోపణలపై ఎమ్మెల్య చందన బౌరి తీవ్రంగా స్పందించారు. డ్రైవర్‌తో నాకు పెళ్లి ఏంటి? అంటూ నిప్పులు చెరిగారు. ఇది పూర్తిగా విపక్షాలు పన్నిన కుట్ర అని, జనాలు ఈ వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘నా భర్త మద్యం మత్తులో నన్ను శారీరకంగా, మానసికంగా హింసించాడు. నాకు ఇంట్లోనే అనేక సమస్యలు ఉన్నాయి. అందుకే నేను అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. డ్రైవర్‌తో నా వివాహం జరుగలేదు. ఇది పూర్తిగా ప్రతిపక్షాలు చేసిన కుట్ర.’’ అని చందన బౌరి స్పష్టం చేశారు.

కాగా, గురువారం నాడు అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కనీసం తన సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పాపెట్టకుండా వెళ్లారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, అలా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే చందన బౌరి.. గంగాజల్‌ఘాటి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. మరోవైపు కనిపించకుండా పోయిన ఎమ్మెల్యే కోసం అధికారులు, ఆమె భర్త తీవ్రంగా గాలించారు. చివరికి ఆమెనే తన సెక్యూరిటీ సిబ్బందికి స్వయంగా ఫోన్ చేసి తాను పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు సమాచారం అందించారు. ఉదయం 9.30 గంటల సమయంలో ఆమె తిరిగి ఇంటికి వచ్చారు.

ఇదిలాఉంటే.. ఆమె అకస్మాత్తుగా అర్థరాత్రి కనిపించకుండా పోవడంపై చాలా రూమర్స్ వచ్చాయి. ఎమ్మెల్యే చందన బౌరి ఆమె డ్రైవర్‌ కృష్ణను వివాహం చేసుకుందని, అందుకే అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ స్థానికులు చెవులు కొరుక్కున్నారు. రాజకీయ పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఆమె ముందుజాగ్రత్తగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారని జనాలు చెప్పుకున్నారు. అయితే, దీన్ని క్యాష్ చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోశారు. ఆమె తీరును తప్పుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Kishan Reddy: హుజూరాబాద్‌లో గెలిచేది కమలమే.. రెండేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ పతనం ఖాయంః కిషన్‌రెడ్డి

Vishnu Manchu: త్వరలోనే మా సభ్యులకు గుడ్ న్యూస్ చేప్తానంటున్న మంచు హీరో.. వీడియో షేర్ చేసిన విష్ణు..

Raksha Bandhan 2021: రాఖీపండుగకు స్పెషల్‌ ఆఫర్‌.. ఆ రాష్ట్రంలో మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం..