భారతీయులకు బంపరాఫర్ ! 16 దేశాలకు వీసాలు అక్కర్లేదు

పాస్ పోర్టు ఉన్న మనదేశీయులు 16 దేశాల్లో ఏ దేశానికైనా వెళ్లాలంటే వాటికి వీసాలు అక్కర్లేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ తెలిపారు.

భారతీయులకు బంపరాఫర్ ! 16 దేశాలకు వీసాలు అక్కర్లేదు

Edited By:

Updated on: Sep 23, 2020 | 12:17 PM

పాస్ పోర్టు ఉన్న మనదేశీయులు 16 దేశాల్లో ఏ దేశానికైనా వెళ్లాలంటే వాటికి వీసాలు అక్కర్లేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ తెలిపారు. నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవులు తదితర దేశాలకు వెళ్ళగోరేవారికి వీసాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక శ్రీలంక, న్యూజిలాండ్, మలేసియా సహా 36 దేశాలు వీరికి ఈ-వీసా సౌకర్యాన్ని కలిగిస్తున్నాయని ఆయన వివరించారు. ఇరాన్, ఇండోనేసియా, మయన్మార్ తో బాటు 43 దేశాలు వీరికి అక్కడ  చేరాక వీసా వెసులుబాటును కలిగిస్తున్నాయని, ఈ జాబితాను విదేశాంగ శాఖ వెబ్ సైట్ లో పొందు పరిచామని ఆయన పేర్కొన్నారు

 

Loading...
Unable to load recommendations.
Follow Us