Viral Video: ఛీ.. వ్యాక్.. ఏం మనిషివిరా.. జ్యూస్‌ పాత్రలు క్లీన్‌ చేసే క్లాత్‌తో.. అవేం పాడు పనులురా..

సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌గా మారే కొన్ని సంఘటనలు జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. కానీ తాజాగా డెహ్రాడూన్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన మాత్రం నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. ఇంతకు ఈ సంఘటన ఏంటి.. నెటిజన్లు అంత ఆగ్రహించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.

Viral Video: ఛీ.. వ్యాక్.. ఏం మనిషివిరా.. జ్యూస్‌ పాత్రలు క్లీన్‌ చేసే క్లాత్‌తో.. అవేం పాడు పనులురా..
Viral News

Updated on: Oct 09, 2025 | 8:01 PM

కొందరు చిరు వ్యాపారుల ప్రవర్తన కొన్ని సార్లు జనాలకు చాలా చిరాకు తెప్పిస్తుంటుంది. తాజాగా డెహ్రాడూన్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఒక జ్యూస్ అమ్మే వ్యక్తి తన ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించిన గుడ్డతో జ్యూస్‌ తయారు చేసే పాత్రలను శుభ్రం చేశాడు. అది గమనించిన అక్కడే ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆ జ్యూస్ అమ్మే వ్యక్తిని నిలదిశాడు. అతనితో కాసేపు వాగ్వాదం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో వైరల్‌గా మారిన ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరింది. దీంతో ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన జ్యూస్‌ అమ్మే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అతని జ్యూస్ బండిని స్వాధీనం చేసుకొని అతనికి జరిమానా విధించినట్టు పోలీసులు తెలిపారు.

మరోవైపు ఈ వీడియో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ , వాట్సాప్ వంటి అన్ని ప్లాట్‌ఫామ్‌లలో త్వరగా వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రజారోగ్యం, పరిశుభ్రత ప్రమాణాలపై నెటిజన్లలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ వీడియో చూసిన చాలా మంది ఆ జ్యూస్ అమ్మే వ్యక్తి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.