Madhya Pradesh: అప్పట్లో తాళ్లతో నదిని దాటారు.. ఇప్పుడు గొడుగులేసుకుని పాఠాలు వింటున్నారు! సారూ.. ఏందిదీ!

|

Jul 28, 2022 | 8:07 PM

వాన వస్తే తడవకుండా వెళ్లడానికి ఇంట్లో వాళ్లు గొడుగు చేతికిచ్చి పంపిస్తారు. ఐతే ఈ ఊళ్లో మాత్రం విద్యార్ధులు స్కూల్‌కు వెళ్లాలంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా చేతికి గొడుగిచ్చి పంపిస్తున్నారు. ఎందుకో తెలుసా..? ప్రస్తుతం ఈ స్కూల్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట..

Madhya Pradesh: అప్పట్లో తాళ్లతో నదిని దాటారు.. ఇప్పుడు గొడుగులేసుకుని పాఠాలు వింటున్నారు! సారూ.. ఏందిదీ!
Umbrellas Inside Class
Follow us on

Students in School Hold Umbrella Inside Classroom: వాన వస్తే తడవకుండా వెళ్లడానికి ఇంట్లో వాళ్లు గొడుగు చేతికిచ్చి పంపిస్తారు. ఐతే ఈ ఊళ్లో మాత్రం విద్యార్ధులు స్కూల్‌కు వెళ్లాలంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా చేతికి గొడుగిచ్చి పంపిస్తున్నారు. ఎందుకో తెలుసా..? ప్రస్తుతం ఈ స్కూల్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఖైరికాల గ్రామంలోనున్న ప్రాథమిక పాఠశాలలో పిల్లలు క్లాస్ రూంలో గొడుగులతో కూర్చుని పాఠాలు వింటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్ మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర సలుజా ఈ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశాడు. తన ట్వీట్‌కు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ట్యాగ్‌ చేసి ఆ రాష్ట్ర సీఎంను ఈ విధంగా ప్రశ్నించారు.

‘రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఏ విధంగా ఉందో ఈ ఫోటో తెల్పుతోంది. శివరాజ్‌ ప్రభుత్వంలో విద్యార్ధులు పాఠశాల పై కప్పు నుంచి కారుతున్న నీటిలో తడవకుండా ఉండేందుకు గొడుగులు వేసుకుని చదువుకోవల్సి వచ్చింది. శివరాజ్‌ ప్రభుత్వం వాస్తవికత ఇదీ!’ అని ట్వీట్‌ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌ అయిన ఈ ఫొటోపై నెటిజన్ల నుంచి భిన్న కామెంట్లు వస్తున్నాయి. రాష్ట్రంలోని పాఠశాలల భవనాలు ఏ విధంగా ఉన్నయో ఈ ఫొటో స్పష్టంగా తెల్పుతోంది. విద్యార్ధులు గొడుగులేసుకుని పాఠాలు వింటున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా గతంలో పాఠశాలలకు వెళ్లేందుకు స్కూల్‌ స్టూడెంట్స్‌ తాళ్లతో నదిని దాటిన సంగతి తెలిసిందే.