మేనల్లుడితో ఆ యవ్వారం.. భర్తను చంపి ఇంటి వెనకాల పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్‌ ఏంటో తెలిస్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుచెప్తున్నాడనే కారణంతో ఓ 45 ఏళ్ల ఇల్లాలు ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భర్త మృతదేహాన్ని ఇంటి వెనకాల పాతిపెట్టింది. ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏమిటంటే.. ఆమె ప్రియుడి ఎవరో కాదు.. తన మెనల్లుడైన 20 ఏళ్ల కుర్రాడు. 

మేనల్లుడితో ఆ యవ్వారం.. భర్తను చంపి ఇంటి వెనకాల పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్‌ ఏంటో తెలిస్తే..
Up Crime News

Updated on: Sep 08, 2025 | 8:13 PM

ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుచెప్తున్నాడనే కారణంతో ఓ 45 ఏళ్ల ఇల్లాలు ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో వెలుగు చూసింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భర్త మృతదేహాన్ని ఇంటి వెనకాల పాతిపెట్టింది. బాధితుడు కనిపించట్లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సచేండిలోని లాలూపూర్ గ్రామానికి చెందిన శివవీర్‌ సింగ్, లక్షి(45) అనే దంపతులకు ముగ్గురు పిల్లలతో కలిసి స్థానికంగా నివసిస్తున్నారు. అయితే లక్ష్మీ కొన్నాళ్లుగా తనకు వరుసకు మేనల్లుడు అయిన అమిత్‌సింగ్‌(20)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఇద్దరికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అయినా వాళ్ల ప్రవర్తనలో మాత్రం మార్పురాకపోగా.. తమ సంబంధానికి అడ్డుచెప్తున్న శివవీర్‌ సింగ్‌నే లేపేయాలని ఇద్దదూ డిసైడ్ అయ్యారు.

దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి శివవీర్ సింగ్‌ హత్యకు ప్లాన్ చేశారు. పతకం ప్రకారం లక్ష్మి టీలో మత్తుమందు కలిపి భర్తకు ఇచ్చింది. అది తాగిన భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత అల్లుడితో కలిసి లక్ష్మీ ఇనుపరాడ్డుతో భర్తను కొట్టి చంపింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా భర్త మృతదేహాన్ని ఇంటి వెనకాలే ఉన్న కాళీ ప్లేస్‌లో గొయ్యి తీసి పాతిపెట్టి్ంది. శివవీర్‌ సింగ్ కనిపించట్లేదని పక్కింటి వారు, పిల్లలు అడినప్పుడు అతను పనికోసం గుజరాత్ వెళ్లినట్టు అందరినీ నమ్మించింది.

అయితే దాదాపు 10 నెలలు అయినా శివవీర్‌ సింగ్‌ తిరిగి రాకపోవడం, కనీసం ఫోన్‌ కూడా చేయకపోవడం, ఫోన్ చేసినా కలవక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శివవీర్‌ సింగ్‌ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారికి లక్ష్మికి తన మేనల్లుడు అమిత్ సింగ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుసుకున్నారు.

శివవీర్‌ సింగ్‌ను వీరే ఏదైనా చేసి ఉంటారనే అనుమానంతో వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన రీతిలో విచారించగా తామే ఈ నేరం చేసినట్లుగా అంగీకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో బాధితుడి మృతదేహాం కోసం ఇంటి వెనకాల తవ్వి చూడగా అక్కడ కేవలం అతని అస్థిపంజరం మాత్రమే లభ్యమైంది. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.