Lipstick plant: అద్భుతం.. వందేళ్ల తర్వాత కనిపించిన అరుదైన లిప్‌స్టిక్‌ మొక్క..!

|

Jun 06, 2022 | 8:43 PM

Lipstick plant: సృష్టిలో వైవిధ్యభరిత వృక్ష సంపద ఉంది. లక్షల రకాల మొక్కలు ఉన్నాయి. మొక్కలకైనా, చెట్లకైనా పూలు ఎంతో అందాన్ని ఇస్తాయి. కొన్ని రకాల పూలను..

Lipstick plant: అద్భుతం.. వందేళ్ల తర్వాత కనిపించిన అరుదైన లిప్‌స్టిక్‌ మొక్క..!
Lipstick Plant
Follow us on

Lipstick plant: సృష్టిలో వైవిధ్యభరిత వృక్ష సంపద ఉంది. లక్షల రకాల మొక్కలు ఉన్నాయి. మొక్కలకైనా, చెట్లకైనా పూలు ఎంతో అందాన్ని ఇస్తాయి. కొన్ని రకాల పూలను మనం చూసి ఉండం కూడా! మొన్నటికి మొన్న అమ్మాయి ముద్దు పెట్టినట్టుగా ఉనన పూలను చూసి షాక్‌ అయ్యాం కదా! ఇప్పుడేమో అత్యంత అరుదైన లిప్‌స్టిక్‌ పూల మొక్కలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అత్యంత అరుదైన లిప్‌స్టిక్‌ మొక్కను బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిశోధకులు అరుణాచల్‌ప్రదేశ్‌లో గుర్తించారు. అంజా జిల్లాలో కిందటేడాది డిసెంబర్‌లో ఇది కనిపించింది. లిప్‌స్టిక్‌ మొక్క శాస్త్రీయ నామం ఏస్కీనాంథస్‌ మానటేరియా డ్యూన్‌. దీని పువ్వులు లిప్‌స్టిక్‌లాగా గులాబీ రంగులో ఉంటాయి. దీన్ని మొట్టమొదటిసారిగా 1912లో బ్రిటిష్‌ శాస్త్రవేత్త స్టీఫెన్‌ డ్యూన్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లోనే దీన్ని కనుగొన్నారు. ఈ మొక్క మళ్లీ వందేండ్ల తర్వాత కనిపించింది. లిప్‌స్టిక్‌ మొక్క ఐయూసీఎన్‌ అంతరించి పోతున్న మొక్కజాతుల్లో ఉన్నది.