ఆపుతావా.. రెండు ‘చెంపదెబ్బలు’ కొట్టాలా? తన తల్లికి ఆక్సిజన్ కావాలని అడిగిన వ్యక్తితో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్!

|

Apr 23, 2021 | 4:37 PM

కరోనా విపత్కర పరిస్థితుల్లో భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలావరకు గందరగోళంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కోవిడ్ -19 రోగులకు సహాయాన్ని అందించడంలో ఇది విఫలం అవుతోంది.

ఆపుతావా.. రెండు చెంపదెబ్బలు కొట్టాలా? తన తల్లికి ఆక్సిజన్ కావాలని అడిగిన వ్యక్తితో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్!
covid deaths
Follow us on

కరోనా విపత్కర పరిస్థితుల్లో భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలావరకు గందరగోళంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కోవిడ్ -19 రోగులకు సహాయాన్ని అందించడంలో ఇది విఫలం అవుతోంది. ఎందుకంటే, వైరస్ తో పోరాడటానికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, హాస్పిటల్ పడకలు, మందులు, వ్యాక్సిన్లు మొదలైనవన్నీ తగ్గిపోయాయి. మరోవైపు కోవిడ్ బాధితుల సంఖ్య గంట గంటకూ పెరిగిపోతోంది. సహాయం కోసం సోషల్ మీడియాలో అభ్యర్ధనలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుంటే, కరోనాతో పోరాటం చేస్తున్న పేషెంట్ల సహాయకుల ఆవేదన కూడా తీవ్రం అవుతోంది.

తాజాగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్ మధ్యప్రదేశ్ లోని దామో జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆ సమయంలో కరోనా పేషెంట్ తో పాటు వచ్చిన ఒక వ్యక్తి ఆక్సిజన్ కోసం అక్కడ విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కరోనా పేషెంట్ కు ఆక్సిజన్ వెంటనే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆక్సిజన్ సిలెండర్లు దొరకకపోవడంతో ఆ వ్యక్తి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ కు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాడు. అతను మంత్రితో పరుషంగా మాట్లాడటంతో మంత్రి ప్రహ్లాద్ పటేల్ సహనం కోల్పోయారు. ఒక్కసారిగా ఆ వ్యక్తిపై విరుచుకుపడ్డారు. ”మీరు ఇంకా ఇలాగే మాట్లాడితే నేను మేకు రెండు చంప దెబ్బలు ఇవ్వాల్సి ఉంటుంది.” అంటూ కోపంగా హెచ్చరించారు. 36 గంటలుగా తన తల్లికి ఆక్సిజన్ సిలెండర్ కోసం వెతికి వెతికి విసిగిపోయాననీ, మంత్రి తనను కొట్టినా ఫర్వాలేదు కానీ, తన తల్లికి ఆక్సిజన్ ఇప్పిస్తే చాలనీ బేలగా ఆ వ్యక్తి చెప్పడం అక్కడ అందరినీ కదిలించి వేసింది.

మొత్తం సంఘటన ఈ వీడియోలో మీరు చూడొచ్చు.

కాగా, కేంద్ర మంత్రి తీరు ఆన్‌లైన్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. చాలా మంది మంత్రిని సహనం లేని వ్యక్తి అనీ, అహంకారి అనీ వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా ఆయన ప్రవర్తన నాయకుడికి ఉండాల్సినది కాదనీ, ఆయన మంత్రిగా పనిచేయరనీ అంటున్నారు. ఆన్ లైన్ లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ పై వెల్లువెత్తిన ఆగ్రహంలో కొన్ని ట్వీట్ లు ఇక్కడ చూడొచ్చు..