పాఠశాల విద్యార్థులకు ఏఐ, కంప్యూటేషనల్ థింకింగ్‌ తప్పనిసరిః కేంద్ర విద్యా శాఖ మంత్రి

మన దేశంలోని పాఠశాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి, అత్యాధునిక విజ్ఞానాన్ని అందించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ దిశగా ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో 2026-27 నాటికి 'విద్యలో AI' (AI in Education), 'విద్య కోసం AI' (AI for Education) అనే రెండు కీలక లక్ష్యాలను సాధించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

పాఠశాల విద్యార్థులకు ఏఐ, కంప్యూటేషనల్ థింకింగ్‌ తప్పనిసరిః కేంద్ర విద్యా శాఖ మంత్రి
Union Education Minister Dharmendra Pradhan

Updated on: Apr 02, 2026 | 8:43 AM

మన దేశంలోని పాఠశాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి, అత్యాధునిక విజ్ఞానాన్ని అందించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ దిశగా ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో 2026-27 నాటికి ‘విద్యలో AI’ (AI in Education), ‘విద్య కోసం AI’ (AI for Education) అనే రెండు కీలక లక్ష్యాలను సాధించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి, CBSE విద్యా కమిటీ రూపొందించిన ఒక సమగ్ర ప్యాకేజీని ప్రవేశపెట్టింది.

పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే గణితం, భాష వంటి సబ్జెక్టులతో పాటు పిల్లలకు ఏఐ (AI), కంప్యూటేషనల్ థింకింగ్ బోధించేందుకు ఒక కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, పాఠశాలల్లో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించేందుకు సిలబస్‌ను, 6వ తరగతి పాఠ్యపుస్తకాన్ని కూడా విడుదల చేశారు. భారతదేశాన్ని ఒక ప్రపంచ స్థాయి AI సూపర్-హబ్‌గా తీర్చిదిద్దడమే అంతిమ లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. ఇందుకోసం నూతన తరాన్ని సన్నద్ధం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు CBSE, NCERT సంస్థలకు కేంద్ర మంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, అన్ని భాషలలో ఏఐ, కంప్యూటేషనల్ థింకింగ్‌పై పాఠ్యపుస్తకాలను సిద్ధం చేయాలని సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్‌టీలను ఆదేశించారు. వీటిని అన్ని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండళ్లతో పంచుకోవాలని కూడా ఆయన కోరారు. సీబీఎస్ఈ పాఠశాలల్లో ఏఐ, కంప్యూటేషనల్ థింకింగ్‌పై ఈ పాఠ్యపుస్తకాల బోధన ఇప్పుడే ప్రారంభమైనప్పటికీ విద్యాశాఖ మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.

దీని బోధనకు సంవత్సరానికి ఐదు నుండి ఎనిమిది గంటల సమయం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయని ప్రధాన్ అన్నారు. అయితే తార్కిక ఆలోచనా నైపుణ్యాలు ఉన్నవారికి మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించిన హ్యాండ్‌బుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద, ఉపాధ్యాయులకు మొదట దీనిని బోధించడంలో శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us