
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం కేంద్ర మంత్రి వర్గం జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ పేరును మార్చినట్లు కూడా ప్రకటించారు. ఇక నుంచి కోలకతా పోర్ట ట్రస్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్‌గా మార్చినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ పేరు మార్పు అంశం ప్రధాని మోదీ సమక్షంలోనే ప్రస్తావనకు వచ్చింది. అంతేకాదు.. అప్పడే ఈ పోర్ట్ ట్రస్ట్ పేరును మార్చుతున్నట్లు ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.