వారి వివరాలు చెప్పండి.. 500 క్యాష్‌ సొంతం చేసుకోండి..!

లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో 235 కరోనా కేసులు నమోదు కాగా.. 45 మంది మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలోకి ఎవరూ ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోకి కొత్తగా ప్రవేశించిన వారి వివరాలు చెబితే రూ.500 ఇస్తామని ఉజ్జయిని పోలీసులు ప్రకటించారు. దీనిపై ఆ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. వివరాలు తెలిపిన […]

వారి వివరాలు చెప్పండి.. 500 క్యాష్‌ సొంతం చేసుకోండి..!

Updated on: May 10, 2020 | 5:41 PM

లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో 235 కరోనా కేసులు నమోదు కాగా.. 45 మంది మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలోకి ఎవరూ ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోకి కొత్తగా ప్రవేశించిన వారి వివరాలు చెబితే రూ.500 ఇస్తామని ఉజ్జయిని పోలీసులు ప్రకటించారు. దీనిపై ఆ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. వివరాలు తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. క్యాష్‌తో పాటు ఓ సర్టిఫికేట్‌ కూడా వారికి ఇస్తామని ప్రకటించారు. కాగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో తబ్లీగ్‌ జమాత్‌ల వివరాలు చెప్పిన వారికి నజరానా ఇస్తామని అప్పట్లో కొన్ని రాష్ట్రాల పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వేలాది మందిని పోలీసులు కనుక్కొని.. వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.

Read This Story Also: అందుకే ఆ మూవీ ఆఫర్ వదులుకున్నా..!

Loading...
Unable to load recommendations.
Follow Us