Udaipur Murder Case: ఉదయ్‌పుర్‌ దర్జీ హంతకుల వెనుక ఉన్నది వీరే.. కీలక ఆధారాలు సేకరిస్తున్న ఎన్‌ఐఏ..

ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు వారిని వెంబడించి ఇద్దరినీ రాజ్‌సమంద్‌లో అరెస్టు చేశారు. కాగా.. ఈ హత్య పాక్‌ ఉగ్ర ముఠాకు చెందిన స్లీపర్‌ సెల్స్‌ చేసి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

Udaipur Murder Case: ఉదయ్‌పుర్‌ దర్జీ హంతకుల వెనుక ఉన్నది వీరే.. కీలక ఆధారాలు సేకరిస్తున్న ఎన్‌ఐఏ..
Udaipur Tailor Kanhaiya Lal
Follow us

|

Updated on: Jun 29, 2022 | 4:25 PM

రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిపాలన మొత్తం ఉదయపూర్‌లో 144 సెక్షన్‌ను అమలు చేసింది. అదే సమయంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ఉదయ్‌పూర్‌కు చెందిన టేలర్ కన్హయ్య హంతకులను పోలీసులు పట్టుకున్నారు. రాజస్తాన్‌లోని రాజ్‌సమంద్‌కు చెందిన నిందితులు రియాజ్ అక్తారీ, గౌస్ మహ్మద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. టేలర్ కన్హయ్య లాల్ హత్య తరువాత నిందితులిద్దరూ బైక్‌పై పోలీసు బారికేడింగ్‌ను బద్దలు కొట్టి తప్పించుకుంటుండగా పట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు వారిని వెంబడించి ఇద్దరినీ రాజ్‌సమంద్‌లో అరెస్టు చేశారు. కాగా.. ఈ హత్య పాక్‌ ఉగ్ర ముఠాకు చెందిన స్లీపర్‌ సెల్స్‌ చేసి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కన్హయ్య లాల్ హంతకులు ఎవరు?

ఉదయపూర్‌లో టేలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య తర్వాత అరెస్టయిన వారిని ఉదయ్‌పూర్‌లోని సూరజ్‌పోల్ ప్రాంతానికి చెందిన గౌస్ మహ్మద్, కుమారుడు రఫీక్ మహ్మద్, అబ్దుల్ జబ్బార్ కుమారుడు రియాజ్‌లుగా గుర్తించారు. నిందితుడి గుర్తింపును నిర్ధారించినట్లు రాజ్‌సమంద్ పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ చౌదరి తెలిపారు. నిందితులిద్దరూ హెల్మెట్ ధరించి మోటార్‌సైకిల్‌పై పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని.. అయితే భీమా ప్రాంతంలో జరిగిన దిగ్బంధనంలో వారు పట్టుబడ్డారని ఎస్పీ వెల్లడించారు.

వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు..

ఉదయ్‌పూర్‌లో పట్టపగలు హత్య చేసిన నిందితులు నేరాన్ని అంగీకరిస్తూ వీడియో పోస్ట్ చేశారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారిలో ఒకరిని రియాజ్ అక్తారీగా గుర్తించారు. అక్తరీకి పాకిస్థాన్‌కు చెందిన దావత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు ఉన్నట్లుగా చెబుతోంది. ఈ సంస్థకు భారతదేశంలో కూడా శాఖలు ఉన్నాయి. దావత్-ఎ-ఇస్లామీకి చెందిన కొందరు సభ్యులు 2011లో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ సల్మాన్ తసీర్ హత్యతో సహా పలు ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్నారు. దాడికి పాల్పడిన వారికి ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇద్దరు నిందితులను రాజ్‌సమంద్ జిల్లా భీమ్ ప్రాంతంలో పట్టుకున్నారు.

ఎన్‌ఐఏ చేతికి దర్యాప్తు..

ఇదిలా ఉండగా.. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర హోంశాఖ.. జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఈ మేరకు హోంశాఖ ట్విటర్‌లో వెల్లడించింది. ఈ హత్య కేసులో ముమ్మర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ ఉగ్ర ముఠా హస్తం ఉందా..? అనే కోణంలోనూ లోతుగా విచారణ చేపట్టాలని ఎన్‌ఐఏకు సూచించింది.

జాతీయ వార్తల కోసం..

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..