టిక్ టాక్ పై ట్విటర్ మోజు, సిల్వర్ లేక్ సాయపడుతుందా ?

| Edited By: Anil kumar poka

Aug 09, 2020 | 5:55 PM

అమెరికాలో చైనీస్ యాప్ టిక్ టాక్ కార్యకలాపాలను తాము కొంటామని ఓ వైపు మైక్రోసాఫ్ట్ ముందుకు రాగా, ఇదే సమయంలో నేనూ రంగంలో ఉన్నానంటూ ట్విటర్ కూడా రెడీ చెప్పింది.

టిక్ టాక్ పై ట్విటర్ మోజు, సిల్వర్ లేక్ సాయపడుతుందా ?
Follow us on

అమెరికాలో చైనీస్ యాప్ టిక్ టాక్ కార్యకలాపాలను తాము కొంటామని ఓ వైపు మైక్రోసాఫ్ట్ ముందుకు రాగా, ఇదే సమయంలో నేనూ రంగంలో ఉన్నానంటూ ట్విటర్ కూడా రెడీ చెప్పింది. ఇందుకు టిక్ టాక్ తో బాటు దీని  మాతృక సంస్థ అయిన బైట్ డ్యాన్స్ తోనూ ప్రాథమిక చర్చలు జరుపుతోంది. కానీ అగ్రరాజ్యం లో టిక్ టాక్ ఆపరేషన్స్ ని కొనడమంటే మాటలు కాదని, మైక్రొసాఫ్త్ తో పోటీ పడజాలదని  నిపుణులు పెదవి విరుస్తుండగా..ట్విటర్ మాత్రం వీటిని పట్టించుకోవడంలేదు. ఈ సంస్థకు మార్కెట్ కేపిటలైజేషన్ సుమారు 30 బిలియన్ డాలర్లు ఉంది. కానీ కొనుగోలుకు ఇది చాలదని, భారీ మొత్థం  అవసరమవుతుందని అంటున్న నేపథ్యంలో ట్విటర్ షేర్ హోల్డర్లలో ఒకటైన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ..’ సిల్వర్ లేక్’ ఈ విషయంలో ట్విటర్ కు సహాయపడవచ్చునంటున్నారు. మిచిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఒకవేళ సిల్వర్ లేక్ ట్విటర్ కు ‘ఆలంబనగా’ నిలిస్తే మాత్రం అప్పుడు మైక్రోసాఫ్ట్ కి పోటీ రావచ్చునని అభిప్రాయపడ్డారు.

మొత్తానికి అమెరికాలో టిక్ టాక్ ని నిషేధిస్తామని  అధ్యక్ధుడు ట్రంప్ మొదట ప్రకటించి.. ఆ తరువాత బైట్ డాన్స్ కి 45 రోజుల డెడ్ లైన్ ఇవ్వడం, వెంటనే  మైక్రోసాఫ్ట్ మేం కొంటామంటూ ప్రపోజల్ పెట్టడం ఈ యాప్ కి మంచి ఉచిత పబ్లిసిటీ తేగా.. ఇప్పుడు ట్విటర్ కూడా రంగంలోకి దిగడంతో వ్యవహారం టిక్ టాక్ కి అనుకూలంగానే మారేట్టు కనిపిస్తోంది. బాగానే ‘డిమాండును’ మూటగట్టుకుంటోంది.