
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు బిజీబిజీ షెడ్యూల్‌లో పర్యటనను మంగళవారంతో సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ గౌరవార్థం.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం సాయంత్ర మర్యాద పూర్వకంగా విందు ఇచ్చారు. విందుకు హాజరైన ట్రంప్ దంపతులకు అపూర్వస్వాగతం లభించింది. ఈ విందుకు.. కేంద్ర మంత్రులతో పాటుగా.. పలు రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్రంప్‌కు పరిచం చేశారు. రెండు రోజుల భారత్ పర్యటన.. ఎన్నో మధురానుభూతులను కల్గించిందని ట్రంప్ పేర్కొన్నారు. విందు అనంతరం.. ట్రంప్, మెలనియా దంపతులు నేరుగా విమానాశ్రయానికి బయల్దేరారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అమెరికాకు తిరుగుపయనమయ్యారు.