లుంగీకి, లారీకి లింక్.. అక్కడ ఇక జేబుకు చిల్లే..!

లుంగీకి, లారీకి లింక్.. అక్కడ ఇక జేబుకు చిల్లే..!

కొత్త మోటర్ వాహన చట్టం వచ్చిన తర్వాత పలు రాష్ట్రాల్లో నిబంధనలను కఠిన తరం చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా జరిమానాలను విధిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో మరింత కఠినంగా అమలుచేస్తున్నారు. వాహనాలపై ఇంటిపేర్లు ఉన్నా జరిమానా తప్పదని రాజస్థాన్‌ ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయల చలానాతో పాటుగా హెల్మెట్‌ను కూడా ఉచితంగా ఇస్తున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏకంగా వాహనదారులకు డ్రెస్ కోడ్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 09, 2019 | 12:56 PM

కొత్త మోటర్ వాహన చట్టం వచ్చిన తర్వాత పలు రాష్ట్రాల్లో నిబంధనలను కఠిన తరం చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా జరిమానాలను విధిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో మరింత కఠినంగా అమలుచేస్తున్నారు. వాహనాలపై ఇంటిపేర్లు ఉన్నా జరిమానా తప్పదని రాజస్థాన్‌ ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయల చలానాతో పాటుగా హెల్మెట్‌ను కూడా ఉచితంగా ఇస్తున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏకంగా వాహనదారులకు డ్రెస్ కోడ్ కూడా విధించారు. లారీ డ్రైవర్లకు డ్రెస్ కోడ్‌ విధించారు. లుంగీతో డ్రైవింగ్ చేస్తే.. రూ.2000/- జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇకపై ఈ డ్రెస్ కోడ్ పాటించని లారీ డ్రైవర్లకు జరిమానాలు తప్పవని సర్కార్ హెచ్చరించింది.

కొత్త మోటారువాహనాల చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో వాణిజ్య వాహనాలు నడిపే డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని సర్కారు ఆదేశించింది. లారీలు నడిపే డ్రైవర్లు ఫుల్ సైజు ప్యాంటు, షర్టు యూనిఫాంతోపాటు షూ తప్పనిసరిగా ధరించాలని కొత్త మోటారు వాహనాల చట్టం నిర్దేశించింది. డ్రెస్ కోడ్ ను డ్రైవర్లు ఉల్లంఘిస్తే 1989 మోటారువాహనాల చట్టం ప్రకారం 500 రూపాయల జరిమానా ఉండేది. ప్రస్తుత సవరించిన కొత్త చట్టం 2019ఎంవీ యాక్ట్ ప్రకారం.. డ్రైవర్లు లుంగీ ధరించి డ్రైవింగ్ చేస్తే రూ. 2000/-రెండువేల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu